Coronavirus in India: బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, దగ్గుబాటి పురంధేశ్వరిలకు కరోనా, దేశంలో తాజాగా 80,472 మందికి కోవిడ్-19, 62,25,764కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
2020 Coronavirus Pandemic in India (photo-Ians)

New Delhi, September 30: దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 80,472 క‌రోనా పాజిటివ్ కేసులు (Coronavirus Cases in India) న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 62,25,764కు చేరింది. ఇందులో 9,40,441 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మ‌రో 51,87,826 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని ఇంటికి చేరారు. నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వ‌ల్ల 1179 మంది మ‌ర‌ణించారు. దీంతో క‌రోనా మృతుల సంఖ్య 97,497కు (Coronavirus deaths in india) చేరింద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌క‌టించింది.

దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు 83.33 శాతానికి చేరింద‌ని, మ‌ర‌ణాల రేటు 1.57 శాతంగా ఉంద‌ని వెల్ల‌డించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 15.42 శాతంగా ఉన్నాయ‌ని తెలిపింది. దేశ‌వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 29 వ‌ర‌కు 7,41,96,729 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని భార‌తీ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. ఇందులో నిన్న ఒక్క‌రోజే 10,86,688 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని వెల్ల‌డించింది.

కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషణ్ మాట్లాడుతూ ఐసీఎంఆర్ నిర్వహించిన రెండవదశ సీరో సర్వే రిపోర్టు వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటికే దేశంలోని సగం జనాభా కరోనా బారినపడ్డారు.ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 22 వరకూ 29,082 మందిని పరిగణలోకి తీసుకుని సర్వే చేయగా, వారిలో 6.6 శాతం మందికి కరోనా సోకినట్లు తేలిందన్నారు. కాగా మహారాష్ట్రలో కరోనా బారిన పడినవారి సంఖ్య కన్నా, వ్యాధి నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య అధికంగా ఉంటోంది. గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో కొత్తగా 14,976 కరోనా కేసులు నమోదు కాగా, ఇదే సమయంలో 19,212 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.

చైనా నుంచి మరో ప్రమాదకర వైరస్, క్యూలెక్స్‌ దోమ ద్వారా క్యాట్‌ క్యూ వైరస్‌, కర్ణాటకలో ఇద్దరికీ సోకిన సీక్యూవీ, జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ హెచ్చరిక

ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కరోనా (Venkaiah Naidu tests positive for Covid-19) బారిన పడ్డారు. ఆయనకు కరోనా లక్షణాలేవీ లేవని, ఆరోగ్యంగానే ఉన్నారని ఉపరాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపింది. సాధారణ పరీక్షల్లో భాగంగా కరోనా టెస్టు చేయటంతో పాజిటివ్‌ అని తేలిందని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్వీట్‌ చేసింది. వెంకయ్యనాయుడు సతీమణి ఉషకు వైరస్‌ సోకలేదని, ఆమె స్వీయ ఏకాంతంలో ఉన్నారని పేర్కొంది. ఈ నెల 24తో ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు రాజ్యసభ చైర్మన్‌ హోదాలో వెంకయ్యనాయుడు హాజరయ్యారు. దాంతో సభలో ఉన్నవారిలో ఇంకెవరికైనా వైరస్‌ సోకిందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మోదీ సర్కారుపై ఆమ్నెస్టీ తీవ్ర విమర్శలు, ఇండియాలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నామంటూ ప్రకటన, బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

తాజాగా బీజేపీ సీనియర్ నేత పురందేశ్వరికి కరోనా పాజిటివ్ (Purandeswari Tested Positive for Coronavirus) అని నిర్దారణ అయ్యింది. అనారోగ్యంగా ఉండంటంతో పరీక్షలు చేయించుకోగా ఆమెకు కరోనా సోకినట్టు తేలింది. అయితే సింటమ్స్ కాస్త ఎక్కువగా ఉండడంతో ఆమె హైదరాబాద్‍లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఇటీవలే ఆమెకి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వరించింది. ఈ క్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలా ఆమెకు కరోనా సోకి ఉండవచ్చని భావిస్తున్నారు.