Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

New Delhi, September 28: దేశంలో గ‌త 24 గంట‌ల్లో అత్య‌ధికంగా రికార్డు స్థాయిలో 82,170 క‌రోనా పాజిటివ్ కేసులు (COVID-19 in India) న‌మోద‌య్యాయి. మరోవైపు ఒక్క‌రోజులోనే 1,039 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 95వేలు దాటాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం కేసులు 60,74,703కు (COVID-19 Cases in India) చేరుకున్న‌ట్లు హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. ఓ వైపు కోవిడ్ కేసులు పెరుగుతున్నా రిక‌వ‌రీ రేటు కూడా అదే స్థాయిలో గ‌ణ‌నీయంగా పెరుగుతుంది. 95,542కు మరణాల సంఖ్య (COVID-19 Deaths) చేరింది.

గ‌డిచిన 24 గంట‌ల్లోనే దేశ వ్యాప్తంగా 74,893 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు 50,16,520 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. క‌రోనా రిక‌వ‌రీ రేటు 82.58 శాతంగా ఉండ‌గా, మొత్తం న‌మోదైన కేసులలో యాక్టివ్ కేసుల శాతం 15.85 శాతంగా ఉంది. ప్ర‌స్తుతం 9,62,640 యాక్టివ్ కేసులున్న‌ట్లు అధికారులు తెలిపారు. మ‌ర‌ణాల రేటు సైతం 1.57 శాతానికి తగ్గిన‌ట్లు కేంద్రం హెల్త్ బులిటెన్‌లో వెల్ల‌డించింది. గ‌డిచిన 24 గంట‌ల్లోనే దేశంలో 7,09,394 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు 7,19,67,230 కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

24 గంటల్లో 169 మంది పోలీసులకు కరోనా, ఇద్దరు మృతి, మహారాష్ట్ర వ్యాప్తంగా 22,629 మంది పోలీస్ సిబ్బందికి కోవిడ్, 123,21,176 కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

మహారాష్ట్రలో గడిచిన 24గంటల్లో కొత్తగా 18,056 కేసులు నిర్ధారణ అయ్యాయని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఒకే రోజు మహమ్మారితో 380 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా వైరస్‌ నుంచి కోలుకొని 13,656 మంది ఇండ్లకు వెళ్లారు. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 13,39,232కు చేరగా.. ప్రస్తుతం 2,73,228 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 10,30,015 డిశ్చార్జి కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ముంబైలో 2,261 కొవిడ్‌ కేసులు నిర్ధారణ కాగా.. 44 మరణాలు నమోదయ్యాయని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) తెలిపింది. ప్రస్తుతం క్రిశీయాల కేసులు 26,593 ఉండగా.. మొత్తం మరణాల సంఖ్య 8,791కు చేరిందని బీఎంసీ తెలిపింది.