New Delhi, September 15: దేశంలో గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 83,809 కరోనా పాజిటివ్ కేసులు (2020 Coronavirus Pandemic in India) నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 49,30,237కు (COVID-19 Cases in India) చేరింది. తాజాగా వైరస్ బారిపడి 1054 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 80,776కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 79,292 డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారిసంఖ్య 38,59,400గా నమోదైంది.
దేశంలో 78.28 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. యాక్టివ్ కేసుల శాతం 20.08 శాతం ఉండగా... దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 9,90,061 ఉన్నాయి. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.64 శాతానికి తగ్గింది. ఇక గడచిన 24 గంటలలో దేశంలో 10,72,845 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల నిర్వహించారు. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య 5,83,12,273గా నమోదైనట్లు కేంద్రవైద్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
కోవిడ్ నేర్పిన పాఠంతొ ప్రకృతిని, జీవజాలాన్ని పరిరక్షించుకోవడం ఇప్పటికైనా నేర్చుకోకపోతే కోవిడ్ –19 తరహా విపత్తులు మరిన్ని ఎదుర్కోక తప్పదని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (World Wide Fund for Nature (WWF) తన లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ –2020లో స్పష్టం చేసింది. రెండేళ్లకు ఒకసారి విడుదల చేసే లివింగ్ ప్లానెట్ రిపోర్ట్‌ను ఈసారి దాదాపు 125 మంది నిపుణులు కలిసి సిద్ధం చేశారు. 1970 నుంచి 2016 మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 21 వేల క్షీరదాలు, పక్షులు, జలచరాలు, సరిసృపాలు సంతతిని పరిశీలిస్తూ సిద్ధం చేసిన ఈ నివేదిక దాదాపు 164 పేజీల నిడివి ఉంది.