2020 Coronavirus Pandemic in India (photo-Ians)

New Delhi, June 4: క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య భార‌త్‌లో (Coronavirus Deths in India) ఆరు వేలు దాటింది. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 9304 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దేశంలో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య (Coronavirus Cases in India) 2,16,919కి చేరుకున్న‌ది. గ‌త 24 గంట‌ల్లో 60 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం 106737 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 104107 మంది వైర‌స్ బారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 6075కు చేరుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది. ఇండియా పేరు మార్చలేం, ఇండియా పేరును భార‌త్‌గా మార్చాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన అత్యున్నత ధర్మాసనం

ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 2587 మంది, గుజ‌రాత్‌లో 1122 మంది క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందారు. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ సోకిన వారి సంఖ్య 64,30705కు చేరుకున్న‌ట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ పేర్కొన్న‌ది. ఆ వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 385947గా ఉంది.

భారత్‌లో ఈ నెల 15 నుంచి రోజూ 15 వేలకుపైగా కేసులు నమోదు కావచ్చని చైనా పరిశోధకులు పేర్కొన్నారు. గన్సు ప్రావిన్స్‌లోని లాన్జౌ యూనివర్సిటీ బృందం ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల్లో రోజువారీ కరోనా కేసుల నమోదు అంచనా వ్యవస్థను రూపొందించింది. దీని ప్రకారం భారత్‌లో ఈ నెల 2 నుంచి రోజుకు 9,291 పాజిటివ్‌ కేసుల వరకూ నమోదవుతాయని అంచనా వేసింది. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొన్న 8,909 సంఖ్యకు ఈ అంచనా దగ్గరగా ఉండటం గమనార్హం. అలాగే మే 28 నుంచి 24 గంటల్లో 7,607 వైరస్‌ కేసులు నమోదవుతాయని అంచనా వేయగా, కేంద్రం శుక్రవారం వెల్లడించిన 7,467 సంఖ్యకు ఇది చాలా దగ్గరగా ఉన్నది.