Supreme Court | (Photo Credits: PTI)

New Delhi, June 4: ఢిల్లీకి చెందిన వ్యాపార‌వేత్త న‌మ‌హ ఇండియా (India) పేరును భార‌త్‌గా మార్చాల‌న్న వేసిన పిటిష‌న్‌ను (Change India’s Name Plea) సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విష‌యంలో తాము జోక్యం చేసుకోలేమ‌ని కావాల‌నుకుంటే ఈ ప్ర‌తిపాద‌న‌ను కేంద్రానికి అంద‌జేయాల‌ని సూచించింది. వ్యాపార‌వేత్త న‌మ‌హ ఇండియా పేరును భార‌త్ (Bharat) లేదా హిందుస్తాన్‌గా (Hindustan) మార్చాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో గత వారం పిటిష‌న్ దాఖ‌లు చేశారు.‌ఇండియా' అనే పదం గ్రీకు నుంచి ఉద్భ‌వించింద‌ని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు. ఈ పేరు తొల‌గించ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్ త‌రాలు గ‌ర్విస్తాయ‌న్నారు. రైతుల భరోసా కోసం ఎసెన్సియ‌ల్ క‌మోడిటీస్ యాక్ట్‌, 50 ఏళ్ల రైతుల డిమాండ్‌ నెరవేరిందని తెలిపిన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్

ఈ పేరు మార్పు వల్ల మన జాతీయతపై గర్వంగా అనుభూతి చెందవచ్చునని, పరాయిపాలనను పౌరులు మరిచిపోయేలా చేస్తుందని పేర్కొన్నారు. 'అంతేకాక‌ దేశ చ‌రిత్ర‌లోనూ "భార‌త్ మాతాకీ జై" అనే నినాదాలున్నాయ‌న్నారు. ఇండియా అనే పేరును తొల‌గించ‌డం వ‌ల్ల విముక్తి సాధించిన‌వాళ్ల‌మ‌వుతాం అని వాదించారు.

దీనిపై బుధ‌వారం విచార‌ణ చేప‌ట్టిన అత్యున్న‌త న్యాయ‌స్థానం (Supreme Court) ఇండియాను ఇప్ప‌టికే భార‌త్ అని పిలుస్తున్నార‌ని తెలిపింది. అయినా ఈ విష‌యంలో తాము క‌ల‌గ‌జేసుకోలేమ‌ని స్ప‌ష్టం చేసింది. పేరు మార్పునకు సంబంధించి పిటిష‌న్ కాపీ మంత్రిత్వ శాఖ‌కు ఇవ్వాల‌ని పిటిషనర్ కు సూచించింది.ప్ర‌భుత్వమే దీనిపై నిర్ణ‌యం తీసుకుంటుందని పేర్కొంది. కాగా గ‌తంలోనూ ఇండియా పేరు మార్చాలంటూ 2016లో పిటిష‌న్ దాఖల‌వ‌గా సుప్రీంకోర్టు దాన్ని కొట్టిపారేసింది