Coronavirus Representational Image (Photo Credits: File Image)

New Delhi, December 29: భారత్‌లోకి కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రవేశించింది. కోవిడ్‌-19 పరీక్షలో భాగంగా ఆరుగురికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్దారణ (New Covid Strain in India) అయ్యింది. కాగా గత నెల రోజులలో యూకే నుంచి 33 వేల మంది ప్రయాణికులు ఇండియాకు వచ్చారు. వీరిలో 114 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. బెంగళూరులో ముగ్గురు, హైదరాబాద్‌లో ఇద్దరు, పూణేలో ఒకరికి కొత్తరకం కరోనా స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ ఆరుగురిని ప్రత్యేక గదిలో ఉంచి కేంద్ర వైద్య బృందం పరీక్ష పరీక్షలు నిర్వహిస్తోంది. వీరితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ ప్రభుత్వం క్వారంటైన్‌కు తరలించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది

ఇటీవల బ్రిటన్ నుంచి వచ్చిన 176 మంది భారత్‌కు వచ్చారు. వీరందరికీ కరోనా పరీక్షలు (Mutant UK Virus) చేయగా వారిలో ఆరుగురికి కొత్త స్ట్రెయిన్ నిర్ధారణ అయింది. వీరిలో బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్(ఎన్ఐఎంహెచ్‌ఏఎన్ఎస్)లో ముగ్గురిని గుర్తించారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)లో ఇద్దరిని, అలాగే పూనేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎఐవీ)లో ఒకరిని గుర్తించినట్లు తెలుస్తోంది.

అమెరికాను హడలెత్తిస్తున్న నాలుగు సంక్షోభాలు, ట్వీట్ చేసిన జో బిడెన్, పదవీ బాధ్యతలు చేప‌ట్టిన వెంట‌నే సవాళ్లను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటన

వేరు వేరు రాష్ట్రాల్లో గుర్తించిన వీరిపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ఆరోగ్య శాఖలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఒక్కొక్కరినీ ఒక్కో గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించాయి. అంతేకాకుండా వీరికి ఇప్పటివరకు సన్నిహితంగా ఉన్న వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలించినట్లు సమాచారం. వీళ్ల‌తో కాంటాక్ట్ ఉన్న వాళ్లంద‌రినీ క్వారంటైన్‌కు త‌ర‌లించిన‌ట్లు చెప్పింది. వీళ్ల‌తోపాటు ప్ర‌యాణించిన ఇత‌ర ప్ర‌యాణికులు, వారి కుటుంబాలు, ఇత‌రులను వెతికే ప‌నిలో అధికారులు ఉన్నారు.

కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ లక్షణాలు ఏంటి? ఎలా గుర్తించాలి ? యూకేను వణికిస్తున్న కొత్త కోవిడ్ స్ట్రెయిన్, ఆ దేశానికి రాకపోకలు అన్నీ బంద్

ఎప్ప‌టిక‌ప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సూచ‌న‌లు జారీ చేస్తున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా కేంద్రం వెల్ల‌డించింది. ఇండియాతోపాటు ఇప్ప‌టికే డెన్మార్క్‌, నెద‌ర్లాండ్స్‌, ఆస్ట్రేలియా, ఇట‌లీ, స్వీడ‌న్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, స్విట్జ‌ర్లాండ్‌, జ‌ర్మ‌నీ, కెన‌డా, జ‌పాన్‌, లెబ‌న‌న్‌, సింగ‌పూర్ దేశాల‌కూ యూకేలో క‌నిపించిన కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ పాకింది.