Covid in India: కరోనా డైలీ రిపోర్ట్ ఇదిగో, గత 24 గంటల్లో 1,805 కేసులు నమోదు, కొత్తగా ఆరు మంది మృతి, 10 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య
Representational (Credits: Twitter/ANI)

New Delhi, Mar27: దేశంలో(India) కరోనా వైరస్‌ (Corona Virus) రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Ministry of Health) వెల్లడించిన వివరాల ప్రకారం.. వరుసగా రెండోరోజు 1,800లకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 1,890 కేసులు నమోదైన విషయం తెలిసిందే. గత 24 గంటల్లో 56,551 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,805 కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,47,05,952కి చేరింది.

ఇక దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య పది వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 10,300 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో 2020 ఏప్రిల్‌ తర్వాత 2022 నవంబర్‌లో యాక్టివ్‌ కేసుల సంఖ్య పదివేల దిగువకు పడిపోయింది. అప్పటి నుంచి పదివేల మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి. కొత్తగా 932 మంది కొవిడ్‌ (Covid-19) మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,41,64,815కి చేరింది.

మరో డేంజర్ న్యూస్, కరోనా సోకిన వారిలో మరో ప్రమాదకర బ్యాక్టీరియా అభివృద్ధి, ఇది సోకితే రోగి ప్రమాదకర స్థితిలోకి వెళతాడని శాస్త్రవేత్తలు వెల్లడి

కరోనాతో గత 24 గంటల్లో ఆరుగురు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందగా.. కేరళలో ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,837గా నమోదైంది.రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Ministry of Health) అధికారులు వెల్లడించారు.

కరోనా సోకిన వారికి యాంటీ బయాటిక్స్‌ వాడొద్దు, కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ, దేశంలో కొత్తగా 699 మందికి కొవిడ్‌ పాజిటివ్‌

ఇక ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపారు. రికవరీ రేటు 98.79 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.65 (220,65,54,022) కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Health ministry) వెల్లడించింది.