COVID Outbreak - Representational Image (Photo-PTI)

New Delhi, June 8: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 86,498 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు (Coronavirus in India) నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశంలో 63 రోజుల తర్వాత రోజువారి కొత్త కేసులు సంఖ్య లక్ష కన్నా తక్కువగా నమోదైంది. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 2,89,96,473కు (Covid in India) పెరిగింది. అదే విధంగా గడిచిన 24 గంటల్లో 2123 మంది కరోనా బాధితులు మరణించగా, ఇప్పటివరకు కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3,51,309కు (Covid Deaths) పెరిగింది.

దేశంలో గత 24 గంటల్లో 1,82,282 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు దేశంలో 2,73,41,462 మంది కోవిడ్‌ బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 13,03,702 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉ‍న్నాయి. గత 24 గంటల్లో 18,73,485 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 36,82,07,596 మందికి కరోనా పరీక్షలు చేశారు. దేశంలో ఇప్పటివరకు 23.61 కోట్లకుపైగా వ్యాక్సినేషన్‌ అందించారు.

కేంద్రం సంచలన నిర్ణయం, జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి ఉచిత వ్యాక్సిన్, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం పొడిగింపు, జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగంలోని హైలైట్స్ ఇవే

అర్హులైన దేశ ప్రజలందరికీ కేంద్రమే ఉచితంగా కోవిడ్‌ టీకా అందిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికి జూన్‌ 21 నుంచి ఉచితంగా టీకా అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీకా డోసులను రాష్ట్రాలకు పంపిస్తామన్నారు. దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం ప్రసంగించారు. ‘రాష్ట్రాల వాటా అయిన 25% టీకాలను కేంద్రమే సేకరించి, రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కేంద్రానికి, రాష్ట్రాలకు రెండు వారాల సమయం పడుతుంది. జూన్‌ 21 నుంచి రాష్ట్రాలకు ఉచితంగా టీకాలను పంపించే కార్యక్రమం ప్రారంభిస్తాం. ఈ కార్యక్రమం కింద 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా టీకా లభిస్తుంది’ అని వివరించారు.