International Flights: ఓ వైపు కరోనా కొత్త వేరియంట్ కల్లోలం.. అంతర్జాతీయ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం, అంతర్జాతీయ ప్రయాణికులను అనుమతించేది లేదని స్పష్టం చేసిన యూరోపియన్ దేశాలు
Airport | Representational Image | (Photo Credits: PTI)

New Delhi, November 26: కరోనా మహమ్మారి ప్రభావంతో ఇప్పటికీ అంతర్జాతీయ విమాన సర్వీసులు (International Flights) అరకొరగానే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15 నుంచి 14 దేశాల మినహా భారత్ నుంచి అంతర్జాతీయ విమానాలను తిరిగి (India to Resume Scheduled International Flights) ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, బోట్స్వానాతోపాటు 14 దేశాల నుంచి అంతర్జాతీయ విమానాల సర్వీసును ఆపివేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. డిసెంబర్ 15 నుంచి రోజువారీ అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్రం పేర్కొంది.

అంతర్జాతీయ విమాన సర్వీసుల పునఃప్రారంభంపై సమీక్ష జరిపామని, భారత్ నుంచి విదేశాలకు వెళ్లే విమానాలు, విదేశాల నుంచి భారత్ కు వచ్చే విమాన సర్వీసులకు అనుమతి ఇవ్వనున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖతోనూ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతోనూ, విదేశీ వ్యవహారాల శాఖతోనూ ఈ అంశాన్ని చర్చించామని... గత కొంతకాలంగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణకు సానుకూల స్పందన లభించిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (Civil Aviation Ministry) పేర్కొంది.

అయితే, కొత్త వేరియంట్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) ఇప్పటికే హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో, కేంద్రం తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చే విషయంపై అనిశ్చితి ఏర్పడింది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం మరోసారి సమీక్ష చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాజ్యాంగ దినోత్సవం వేడుకల్లో ప్రధాని మోదీ, విభిన్న‌మైన మ‌న దేశాన్ని రాజ్యాంగం ఏకీకృతం చేసిందని తెలిపిన ప్రధాని, స్వాతంత్య్ర పోరాటయోధులకు,అమరులైన సైనికుల‌కు ఘనంగా నివాళి

ఇదిలా ఉంటే ఆఫ్రికా ద‌క్షిణ దేశాల్లో విస్త‌రిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి యూర‌ప్ దేశాల్లో క‌ల‌వ‌రం పుట్టిస్తున్న‌ది. అందుకే ఆ దేశాలు ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. ఇప్ప‌టికే బ్రిట‌న్‌, జ‌ర్మ‌నీ, ఇట‌లీ దేశాలు ఆఫ్రికా ద‌క్షిణ దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై నిషేధం విధించ‌గా.. తాజాగా ఫ్రాన్స్ ఆయా దేశాల నుంచి వ‌చ్చే విమానాల‌పై 48 గంట‌ల‌పాటు నిషేధం విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రి ఒలీవియ‌ర్ వెరాన్ శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న చేశారు. ఆఫ్రికాలోని ద‌క్షిణ దేశాల్లో కొత్త వేరియంట్ విస్తృతి కార‌ణంగానే తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు.

విదేశీ ప్రయాణికులపై కరోనా ఆంక్షలను త్వరలోనే తొలగించనున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. ఈ జాబితాలో భారత్‌ సహా మరో ఐదు దేశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సౌదీ వెళ్లే విదేశీయులు మరో దేశంలో కచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. అప్పుడే సౌదీలోకి వారిని అనుమతిస్తున్నారు. అయితే వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి భారత్‌, పాకిస్తాన్ తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను నేరుగా తమ దేశంలోకి అనుమతిస్తామని సౌదీ వెల్లడించింది. అయితే ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులంతా కూడా ఐదు రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని తెలిపింది.

ఆసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన, 1,330 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభం కానున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం

ఆఫ్రికా ఖండంలోని ద‌క్షిణ ప్రాంత దేశాల్లో కొత్త ర‌కం క‌రోనా వేరియంట్‌ B.1.1.529 క‌ల‌క‌లం రేపుతున్న‌ది. దీంతో ఆఫ్రికా ద‌క్షిణ‌ప్రాంత దేశాల్లో ఉన్న వారిని త‌మ దేశానికి అనుమ‌తించ‌బోమ‌ని ఇటలీ ఇవాళ ప్ర‌క‌టించింది. ద‌క్షిణాఫ్రికా, లెసోతో, బోట్స్‌వానా, జింబాబ్వే, మొజాంబిక్‌, న‌మీబియా, స్వాజీలాండ్ దేశాల‌కు ఈ నిషేధం వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది. కొత్త ర‌కం B.1.1.529 క‌రోనా వేరియంట్‌పై శాస్త్ర‌వేత్త‌లు అధ్య‌య‌నం జ‌రుపుతున్నార‌ని ఇటలీ ఆరోగ్య‌శాఖ మంత్రి రోబెర్టో స్పెరాంజా చెప్పారు. వేరియంట్ విస్తృతిని అనుస‌రించి తాము స‌రైన స‌మ‌యంలో మరింత ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు.

ద‌క్షిణాఫ్రికా నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై జ‌ర్మ‌నీ, ఇట‌లీ నిషేధం: B.1.1.529. క‌రోనా వేరియంట్ క‌ల‌వ‌ర‌పెడుతున్న నేప‌థ్యంలోనే ద‌క్షిణాఫ్రికా నుంచి వ‌చ్చే విమాన ప్ర‌యాణికుల‌పై నిషేధం విధించిన‌ట్లు యూరోపియ‌న్ యూనియ‌న్ దేశాల చీఫ్ ఉర్సులా వండ‌ర్ లియోన్ శుక్ర‌వారం ట్వీట్ చేశారు. జ‌ర్మ‌నీలో ఇవాళ రాత్రి నుంచి ఆంక్ష‌లు అమ‌ల్లోకి రానున్నాయి. కేవ‌లం జ‌ర్మ‌న్ దేశ‌స్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న‌ప్ప‌టికీ, వారు కూడా త‌ప్ప‌కుండా 14 రోజుల పాటు క్వారంటైన్ పాటించాల‌ని ఆదేశించింది. ద‌క్షిణాఫ్రికా, లిసోథో, బోత్స‌వానా, జింబాబ్వే, మోజంబిక్, న‌మీబియా దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై రోమ్ నేటి నుంచి నిషేధం విధించింది.