తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరులో కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఈ హెలికాప్టర్లో నలుగురు ప్రయాణిస్తున్నారని సమాచారం. ముగ్గురిని కాపాడినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయని, నాలుగో వ్యక్తి కోసం గాలింపు జరుగుతోందని తెలుస్తోంది. గాయపడినవారిని నీలగిరి జిల్లాలోని వెల్లింగ్టన్ కంటోన్‌మెంట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఆర్మీ హెలికాప్ట‌ర్ పూర్తిగా కాలిపోయింది. ఆ ప్ర‌మాదంలో ముగ్గురు మృతిచెందినట్లు ప్ర‌క‌టించారు. కానీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రావ‌త్ ఉన్నారా లేదా అన్న విష‌యం స్ప‌ష్టంగా తెలియ‌దు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)