New Delhi, September 7: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 90,802 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 42 లక్షలు దాటింది. 64,60,250 కేసులతో అమెరికా (America) అగ్రస్థానంలో ఉండగా.. 42,04,614 కేసులతో ( India's Coronavirus Tally) భారత్ రెండో స్థానంలో, 4,137,606 కేసులతో బ్రెజిల్ (Brezil) మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక దేశవ్యాప్తంగా వైరస్ బాధితుల్లో తాజాగా 1016 మంది మృతి చెందడంతో, మొత్తం మృతుల సంఖ్య 71,642 కు (Coronavirus Deaths) చేరింది. భారత్‌లో ఇప్పటివరకు 32,50,429 మంది వైరస్ బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 8,82,542 యాక్టివ్ కేసులున్నాయి.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.తాజాగా నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు మరో 1,016 మంది బాధితులు మృతిచెందారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 6 వరకు దేశవ్యాప్తంగా 4,95,51,507 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. నిన్న ఒక్కరోజే 7,20,362 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీలలో 72 రోజుల తరువాత అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. జూన్ 26న అత్యధికంగా 3,460 కేసులు నమోదు కాగా తాజాగా నిన్న3,256 కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 20 వేలకు చేరింది. ఢిల్లీలో హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నవారి సంఖ్య 11 వేలు దాటింది. రికవరీ రేటు తగ్గుతూ వస్తోంది. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 36,046 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో ఆర్టీపీసీ టెస్టుల సంఖ్య 9,217 కాగా, యాంటీజన్ టెస్టుల సంఖ్య 26,829గా ఉంది.
ఢిల్లీలో కరోనా వ్యాప్తి రేటు 9.03గా ఉండగా, రికవరీ రేటు 86.69గా ఉంది. దీనితోపాటు ఢిల్లీలో కరోనా యాక్టివ్ కేసుల శాతం 10.92గా ఉంది. డెత్ రేటు 2.38గా ఉండగా, గడచిన 24 గంటల్లో కొత్తగా 3,256 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,91,449కి చేరింది. గడచిన 24 గంటల్లో 29 మంది కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,567కు చేరింది. గడచిన 24 గంటల్లో 2,188 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. మొత్తంగా ఢిల్లీలో కరోనా నుంచి 1,65,973 మంది కోలుకున్నారు.