Coronavirus in India | File Image | (Photo Credits: PTI)

New Delhi, December 18: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 22,889 కరోనా పాజిటివ్‌ కేసులు (India Coronavirus) నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య (New Coronavirus Infections) 99,74,447కు చేరాయి. ఇందులో 95,20,827 మంది బాధితులు కరోనా (Coronavirus) నుంచి కోలుకోగా, 3,13,831 మంది చికిత్స పొందుతున్నారు. మరో 1,44,789 మంది బాధితులు మహమ్మారి వల్ల మరణించారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 338 మంది బాధితులు మరణించగా, 31,087 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

దేశంలో రికవరీ రేటు 95.31 శాతంగ ఉందని, మరణాల రేటు 1.45 శాతం, యాక్టివ్‌ కేసులు 3.24 శాతంగా ఉన్నాయని తెలిపింది. తాజాగా కరోనా నుంచి కోలుకున్నవారిలో ఐదు రాష్ట్రాల్లోనే 55 శాతం మంది ఉన్నారని వెల్లడించింది. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో ఎక్కువగా ఉన్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా నిన్నటివరకు 15,89,18,646 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. ఇందులో నిన్న ఒక్కరోజే 11,13,406 నమూనాలను పరీక్షించామని తెలిపింది.

ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఘోష, ఎంఎస్పీపై రాత పూర్వకంగా హామీ ఇస్తామని తెలిపిన కేంద్రం, సాగు చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం, చట్టాలకు తాత్కాలిక బ్రేక్ వేయాలని తెలిపిన అత్యున్నత న్యాయస్థానం

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో గత 24 గంటల్లో 63,821 కరోనా పరీక్షలు నిర్వహించగా, 534 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారినపడినవారి సంఖ్య 877348కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా బారినపడి అనంతపురం, పశ్చిమగోదావరి లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మరణించారు. ఇప్పటివరకు కరోనాతో 7069 మంది మృతిచెందారు.

దేశంలో కరోనా కన్నా ప్రమాదకరమైన వ్యాధి బయటకు, ముకోర్మైకోసిస్ వ్యాధితో 9 మంది మృతి, 44 మంది ఆస్పత్రిలో.. అహ్మదాబాద్‌ని వణికిస్తున్న మ్యూకర్‌మైకోసిస్‌ ఫంగస్

గడచిన 24 గంటల్లో 498 మంది కోవిడ్‌నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు 865825 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 4454 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటి వరకు 1,10,65,297 శాంపిల్స్‌ను పరీక్షించారు.