New Delhi, August 19: దేశంలో 24 గంటల్లో 64,531 మందికి కరోనా (Coronavirus in India) సోకిందని, అదే సమయంలో 1,092 మంది మృతి (Coivd Deaths) చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic India) ఇప్పటివరకు మొత్తం 27,67,274కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 52,889 కి పెరిగింది. ఇక 6,76,514 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 20,37,871 మంది కోలుకున్నారు.ఈమేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నిన్నటిరవకు 3,17,42,782 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. అదేవిధంగా ఆగస్టు 18న 8,01,518 మందికి కరోనా పరీక్షలు చేశామని వెల్లడించింది.
తమిళనాడులో అధికార, విపక్షాలకు చెందిన పలువురు ఎమ్మెల్యే, పార్టీ నాయకులు సైతం కరోనా బారినపడ్డారు. తాజాగా రవాణాశాఖ మంత్రి విజయభాస్కర్ కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి, చికిత్స తీసుకుంటున్నారు. తమిళనాడు వ్యాప్తంగా మంగళవారం 5,709 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, మొత్తం 3,49,654కు చేరాయి.తాజాగా 121 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 6,007కు చేరింది. కరోనాకు తోడయిన స్వైన్ ఫ్లూ, దేశంలో ఇప్పటివరకు 2,721 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు, తెలంగాణలో 443 కేసులు నమోదు, ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిఫుణులు హెచ్చరిక
జార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి బన్న గుప్తా కరోనా పాజిటివ్‌గా తేలారు. ఈమేరకు ఆయన మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ట్విటర్‌లో ప్రకటించారు. గత వారం రోజుల్లో తనను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తాను కరోనా పరీక్ష చేయించుకున్నానని, అందులో పాజిటివ్ వచ్చిందని తెలిపారు. కరోనా లక్షణాలున్నప్పటికీ మంగళవారం ఉదయం జరిగిన మంత్రిమండలి సమావేశానికి గుప్తా హాజరయ్యారు. వ్యవసాయశాఖ మంత్రి బాదల్ పత్రలేఖ్‌తో కలిసి ఆయన కూర్చున్నారు. దీంతో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో సహా సమావేశానికి హాజరైన అందరు క్వారంటైన్ వెళ్లనున్నారు.
దేశంలోని ప్రతి నలుగురిలో ఒకరికి కరోనాతో పోరాడే యాంటీబాడీలు ఉండవచ్చని ఒక జాతీయ స్థాయి ప్రైవేట్ ప్రయోగశాలలో నిర్వహించిన కోవిడ్ -19 పరీక్షల ఆధారంగా వెల్లడయ్యింది. నగరాల్లోని పలు సివిల్ కార్పొరేషన్లు, కొన్ని ప్రముఖ పరిశోధనా సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భారతీయులలో రోగనిరోధక శక్తి చాలా బలంగా ఉందని దీని ద్వారా స్పష్టమవుతున్నదన్నారు. దేశవ్యాప్తంగా థైరోకేర్ ప్రయోగశాల నిర్వహించిన యాంటీబాడీ పరీక్షలలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలుగు చూశాయి. భారతదేశంలో ఇప్పటివరకు రెండు లక్షలకుపైగా పరీక్షలు జరిగాయని ల్యాబ్ మేనేజింగ్ డైరెక్టర్ అరోకిస్వామి వేలుమణి తెలిపారు. కరోనాతో ప్రపంచం అల్లాడుతుంటే వుహాన్ ఎంజాయ్ చేస్తోంది, మాస్క్ లేకుండా వుహాన్ వాటర్ పార్కులో వేలాది మంది జనం, మాయా బీచ్ పార్క్‌లో విద్యుత్ వెలుగుల మ్యూజిక్ పార్టీ
ఈ పరీక్షల ద్వారా 24 శాతం మందిలో కోవిడ్ -19పై పోరాడే ప్రతిరోధకాలు ఉన్నాయని తేలిందన్నారు. సెంట్రల్ ముంబైలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు మాట్లాడుతూ భారతీయులలో ఇంత అధికస్థాయి రోగనిరోధక శక్తి రావడానికి కారణం మనం పాటిస్తున్న పరిశుభ్రతేనని అన్నారు. ముంబైకి చెందిన ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ జోషి మాట్లాడుతూ వృద్ధులను, ఇతర వ్యాధులతో బాధపడుతున్న కరోనా బాధితులను మినహాయించి చూస్తే, దేశంలో కరోనా మరణాలు తక్కువేనని అన్నారు.