maged used for representational purpose only | (Photo Credits: GoAir

New Delhi, July 31: అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధాన్ని (International Flights Suspended) కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి పొడిగించింది. క‌రోనా ప్ర‌భావం ఏమాత్రం త‌గ్గ‌క‌పోవ‌డంతో గ‌త ఏప్రిల్ నుంచి భార‌త పౌర‌విమాన‌యాన శాఖ అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై (International Commercial Passenger Flights) నిషేధాన్ని విడ‌త‌ల వారీగా పొడిగిస్తూ వ‌స్తున్న‌ది. చివ‌రిసారిగా జూలై 15 నుంచి 31 వ‌ర‌కు నిషేధాన్ని పొడిగించింది. శుక్ర‌వారం నాటికి ఆ గడువు కూడా ముగియ‌డంతో ఏకంగా మ‌రో నెల రోజుల‌పాటు నిషేధాన్ని పొడిగిస్తున్న‌ట్లు తెలిపింది. అంతర్జాతీయ విమానాల సర్వీసుల రద్దు గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ డైరెక్టర్‌ జనరల్‌ (DGCA) శుక్రవారం ప్రకటించింది.  వ్యాక్సిన్ వచ్చే దాకా పోరాడాల్సిందే, దేశంలో 16 లక్షలు దాటిన కరోనా వైరస్ కేసుల సంఖ్య, ఒక్కరోజు 6,42,588 కరోనా పరీక్షలు నిర్వహణ

అయితే, అంత‌ర్జాతీయ క‌మ‌ర్షియ‌ల్ ప్యాసెంజ‌ర్ ఫ్లైట్ల‌కు మాత్ర‌మే ఈ నిషేధం వ‌ర్తిస్తుంద‌ని భార‌త పౌర‌విమాన‌యాన శాఖ తెలిపింది. అంత‌ర్జాతీయ కార్గో ఆప‌రేష‌న్స్‌కు, డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) అనుమ‌తితో న‌డుస్తున్న ప్ర‌త్యేక విమానాల‌కు ఈ నిషేధం వ‌ర్తించ‌ద‌ని స్ప‌ష్టంచేసింది. 'అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల రాక‌పోక‌ల‌పై ఆగ‌స్టు 31 అర్ధ‌రాత్రి 11:59 వ‌ర‌కు నిషేధం పొడిగించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది' అని సివిల్ ఏవియేష‌న్ మినిస్ట్రీ ఒక‌‌ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. అంతర్జాతీయ కార్గో విమానాలు మాత్రం యథావిధిగా నడుస్తాయని డీజీసీఏ పేర్కొంది.

Here's the tweet: 

ఇదిలా ఉంటే దేశంలో ప్రస్తుతం హైదరాబాద్‌, పుణే, థానే, బెంగళూరు నగరాల పరిస్థితే ఆందోళన కలిగిస్తోందని, అక్కడ కరోనా (Coronavirus in India) వేగంగా వ్యాప్తి చెందుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ అన్నారు. అదే సమయంలో ఢిల్లీ వేగంగా కోలుకుంటోందని, 89 శాతం రికవరీ రేటుతో అది దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందని వ్యాఖ్యానించారు. దేశంలోని కరోనా పరిస్థితిపై శుక్రవారం ఇక్కడ వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులతో ఆయన అధ్యక్షతన ఓ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో హర్షవర్దన్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకు దేశంలో ఉన్న యాక్టివ్‌ కేసుల్లో 0.28% రోగులు మాత్ర మే వెంటిలేటర్లపై ఉన్నారని తెలిపారు. 1.61% ఐసీయూల్లో, 2.32% రోగులు ఆక్సిజన్‌ సపోర్ట్‌ బెడ్లపై ఉన్నారని వెల్లడించారు. దేశంలో ఇప్పటివరకు పది లక్షల మందికి పైగా రోగులు కరోనా నుంచి కోలుకున్నారన్నారు. రికవరీ రేటు 64.54 శాతంగా ఉందని, కేసుల రెట్టింపు వ్యవధి 21 రోజులుగా ఉందన్నారు.

33.27% మంది రోగులు మాత్రమే వైద్య పర్యవేక్షణలో ఉన్నారని, ఇది మొత్తం పాజిటివ్‌ కేసుల్లో మూడో వంతేనని వివరించారు. మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుతోందన్నారు. మరణాల రేటులో 2.18 శాతంతో భారత్‌.. ప్రపంచంలో అతి తక్కువ మరణాల రేటు కలిగిన దేశాల్లో ఒకటిగా నిలిచిందని హర్షవర్దన్‌ తెలిపారు.