International Flights Suspended: జూలై 31 వరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం, కార్గో,అనుమతి పొందిన విమానాలకు మాత్రమే అనుమతి, ఉత్తర్వులు జారీ చేసిన డీజీసీఏ
Flights | (Representational Image/ Photo Credits: SkymetWeather)

New Delhi, July 3: కరోనావైరస్ కల్లోలం రేపుతున్న నేపథ్యంలో (COVID-19 Cases) అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఇండియా నిషేధాన్ని(International Flights Suspended) మరోసారి పొడిగించింది. ఇది వరకు జూలై 15 వరకు పొడిగించిన కేంద్రం ఈ నెల 31 వరకూ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు డైరెక్టర్ జనరల్​ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) (Civil Aviation Ministry) శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కార్గో, ముందుగా అనుమతి పొందిన విమానాలను కొన్ని రూట్లలో మాత్రమే రాకపోకలకు అనుమతిస్తామని వెల్లడించింది. మాస్క్ ఉన్నా కరోనాతో డేంజరే, దేశంలో రికార్డు స్థాయిలో గడిచిన 24 గంటల్లో 20,903 కొత్త కేసులు నమోదు, 6,25,439కు చేరిన మొత్తం కేసులు, ప్రపంచ వ్యాప్తంగా కోటి దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య

గత నెల 26వ తేదీన జులై 15 వరకూ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలను నిషేధిస్తున్నట్లు డీజీసీఏ పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు మే 6 నుంచి వందే భారత్ మిషన్ కింద ఎయిర్​ ఇండియాతో సహా పలు ప్రైవేట్ ఎయిర్​లైన్స్​ అంతర్జాతీయ సర్వీసులను నడుపుతున్నాయి. మే 25 నుంచి దేశీయ విమానయాన సర్వీసులను నడిపేందుకు డీజీసీఏ (DGCA) అనుమతిచ్చింది.

దేశంలో మహమ్మారి కరోనా (coronavirus Pandemic) కల్లోలాన్ని రేపుతోంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో వైరస్‌ విజృంభిస్తున్నది .తాజాగా రికార్డు స్థాయిలో గడిచిన 24 గంటల్లో 20,903 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు (coronavirus cases) నమోదైనట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన కరోనా హెల్త్‌ బులిటెన్‌లో వెల్లడించింది. దేశంలో కోవిడ్‌ వెలుగుచూసినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో పాజిటివ్‌ కేసులు (India Coronavirus) నమోదవ్వడం ఇదే తొలిసారి. భారత్ బలమేంటో ప్రపంచానికి తెలుసు, లడఖ్‌ భారత్‌లో అంతర్భాగమే, సైనికులను చూసి దేశం గర్వపడుతోంది, బార్డర్లో సైనికుల్లో ఉత్తేజాన్ని నింపిన ప్రధాని నరేంద్ర మోదీ

కొత్త పాజిటివ్‌ కేసులతో కలుపుకొని దేశంలో కరోనా బాధితుల సంఖ్య 6,25,439కు చేరింది. అంతేకాకుండా గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఈ మహమ్మారి కారణంగా 379 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 18,213కు చేరింది.ఇక దేశంలో ఇప్పటివరకు 3,79,892 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ కాగా 2,27,439 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.