Bharat Biotech (Photo Credits: Wikimedia commons)

New Delhi, September 6: భారత్‌ బయోటెక్‌ సం‍స్థ రూపొందించిన నాసల్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌కు (Intranasal COVID-19 Vaccine) డీసీజీఐ మంగళవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్‌ను ఎమ‌ర్జెన్సీగా వాడేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి (Intranasal COVID-19 Vaccine Approved in India) ఇచ్చింది. ఇంట్రానాస‌ల్ కోవిడ్19 టీకాకు డీసీజీఐ అనుమ‌తి ఇచ్చిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ మ‌న్సూక్ మాండ‌వీయ తెలిపారు. కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్‌కు ఇది పెద్ద ప్రోత్సాహం అని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు

ఇండియాలో ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ టీకాకు (Bharat Biotech's Nasal Coronavirus Vaccine) అనుమ‌తి ద‌క్క‌డం ఇదే తొలిసారి. ఇప్ప‌టికే భార‌త్ బ‌యోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ టీకా అందుబాటులో ఉన్న విష‌యం తెలిసిందే. ముక్కు ద్వారా ఇచ్చే ఈ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు దాటిన వారికి ఇచ్చేందుకు అనుమతిచ్చింది. ​

వైరల్ వీడియో.. డాక్టర్ ఎదురుగా గుండె పోటుతో కుప్పకూలిన పేషెంట్, పరుగున వచ్చి రోగి ఛాతిపై సీపీఆర్‌ చేసి బతికించిన డాక్టర్

అయితే అత్యవసర పరిస్థితిల్లో పెద్దవారికి ఉపయోగించేందుకు డీసీజీఐ అనుమితిచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయ తెలిపారు.ఇప్ప‌టికే భార‌త్ బ‌యోటెక్‌ సంస్థకు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్న విష‌యం తెలిసిందే.