ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల వేళ భారత్‌కు వచ్చే ఓ నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ షిప్‌లో ఉన్న 17 మంది భారతీయ సిబ్బంది(Indian crew)ని కలిసేందుకు భారత అధికారులకు అనుమతి ఇవ్వనున్నట్లు ఇరాన్ వెల్లడించింది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ .. ఇరాన్ మంత్రి అమిర్ అబ్దొల్లియాన్‌తో ఈ అంశంపై మాట్లాడిన తర్వాత క్లారిటీ వచ్చింది. భారతీయ సిబ్బందిని కలిసేందుకు సహకరించాలని జైశంకర్ కోరినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మోగిన యుద్ధభేరి.. ఇజ్రాయెల్ పై డ్రోన్ల దాడిని ప్రారంభించిన ఇరాన్.. జనావాసాల మీదకు దూసుకొచ్చిన రాకెట్లు, క్షిపణులు.. వీడియోలు వైరల్
గత శనివారం హర్మూజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెలీ కుబేరుడికి చెందిన వాణిజ్య నౌక ఎంఎస్‌సీ ఏరిస్‌ను ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ దళం హెలికాప్టర్లతో వెంబడించి అధీనంలోకి తీసుకొంది. నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 17 మంది భారతీయులు ఉన్నారు. సీజ్ చేసిన షిప్ గురించి పూర్తిగా తెలుసుకుంటున్నామని, భారత ప్రభుత్వ ప్రతినిధులతో దీనిపై మాట్లాడనున్నట్లు అమిర్ అబ్దొల్లియాన్ తెలిపారు. అయితే ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని జైశంకర్ కోరారు.