Ivanka Tump Joins The India Tour: మరోసారి ఇండియాలో పర్యటించనున్న ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన బృందంలోనే చేరిక, వెల్లడించిన రిపోర్ట్స్
Ivanka Trump with Donald Trump | File Image | (Photo Credits: ANI)

New Delhi, February 21:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో (Donald Trump India Visit) భాగంగా ఆయన కూతురు మరియు సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్ (Ivanka Tump) కూడా భాగస్వామి కాబోతున్నట్లు శుక్రవారం వెలువడిన రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది. ఆమెతో పాటు ఆమె భర్త, డొనాల్డ్ ట్రంప్ సీనియర్ అడ్వైజర్ జారెడ్ కుష్నర్ కూడా వస్తున్నట్లు సమాచారం. యూఎస్ ప్రెసిడెంట్ పర్యటనలో భాగంగా భారత్ - యూఎస్ మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలలో పాల్గొనే ప్రతినిధి బృందంలో వీరూ భాగస్వామ్యం కాబోతున్నారు.

యూఎస్ నుంచి వస్తున్న డెలిగేషన్ బృందంలో ఇవాంకా ట్రంప్ ఆమె భర్తతో పాటు యూఎస్ ట్రేడ్ అడ్వైజర్ రాబర్ట్ లైట్జైజర్, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఎ) రాబర్ట్ ఓ’బ్రియన్, ట్రెజరీ కార్యదర్శి స్టీవ్ మునుచిన్, వాణిజ్య కార్యదర్శి విల్బర్ రాస్ మరియు మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ ఆఫీస్ డైరెక్టర్ మిక్ ముల్వాని కూడా ఉన్నారు. ఫిబ్రవరి 24 మరియు 25వ తేదీలలో రెండు రోజుల పాటు డొనాల్డ్ ట్రంప్ భారత్ లోని అహ్మాదాబాద్, ఆగ్రా మరియు దిల్లీ నగరాలలో పర్యటించనున్నారు.  డొనాల్డ్ ట్రంప్ ప్రయాణించే కారు 'ది బీస్ట్' ప్రత్యేకతలు

Update by ANI:

ఇదిలా ఉండగా, భారతదేశంలో పర్యటించడం ఇది రెండవసారి కాబోతుంది. గతంలో 2017 నవంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (GES- Hyderabad) కు ఇవాంకా ట్రంప్ స్పెషల్ గెస్ట్ గా హాజరైంది. ఇప్పుడు 2020లో మొత్తం ఫ్యామిలీతో కలిసి భారతదేశంలో ఇవాంకా పర్యటించనుంది. ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో కేటీఆర్, దావోస్‌లో తెలంగాణ మంత్రికి అరుదైన గౌరవం

డొనాల్డ్ ట్రంప్ అధ్వర్యంలో నడిచే అన్ని బిజినెస్ ఆర్గనైజేషన్ కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరించే ఇవాంకా ట్రంప్, ఇప్పుడు ఆమె తండ్రి యూఎస్ ప్రెసిడెంట్ కావడంతో ఆయనకు ఉండే సీనియర్ చీఫ్ అడ్వైజర్లలో ఒకరిగా కూడా వ్యవహరిస్తున్నారు.

ఈ పర్యటనలో ట్రంప్ ఫ్యామిలీ మొదటి రోజు అహ్మదాబాద్ మొతెరా స్టేడియం సందర్శన మరియు ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలోని తాజ్ మహల్ వద్ద సూర్యాస్తమయాన్ని వీక్షించనున్నారు. రెండో రోజు దిల్లీలో ఇండియా- యూఎస్ మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలలో పాల్గొంటారని షెడ్యూల్ ప్రకారం తెలుస్తుంది.