Jallikattu: ఒళ్లు ఝలదరించేలా ఎద్దులతో ఫైటింగ్, జల్లికట్టుకు రెడీ అయిన తమిళనాడు, జల్లికట్టు చరిత్ర ఏమిటి ? ఎందుకు తమిళనాడు వాసులు అంత క్రేజ్ చూపిస్తున్నారు, జల్లికట్టుపై విశ్లేషణాత్మక కథనం
Jallikattu: 10 facts about the ancient bull taming sport (Photo-ANI)

Chennai, January 14: సంక్రాంతి వచ్చేసింది. ఇప్పుడు తమిళనాడులో(Tamil Nadu) జల్లికట్టుకు(Jallikattu) అక్కడ జనం సిద్ధమవుతున్నారు. ఎద్దుల్ని(bulls) బరిలోకి దింపేందుకు నిర్వాహకులు సైతం శ్రమిస్తున్నారు. జల్లికట్టులో పాల్గొనే ఎద్దులకు అదిరిపోయేలా శిక్షణ ఇస్తున్నారు.ఇది ఓ సంప్రదాయ క్రీడ, గ్రామీణ ప్రాంత వేడుకగా తమిళనాడు వాసులు జరుపుకుంటారు. ఈ ఏడాది జనవరి 15న ప్రారంభమై జనవరి 31 వరకు ఈ పోటీలు జరుగుతాయి.

ఏపీలో సంక్రాంతి అనగానే కోడిపందేలు ఎలా గుర్తొస్తాయో అలాగే తమిళనాడులో జల్లికట్టు (Traditional bull taming fest )కూడా గుర్తుకు వస్తుంది. ఎన్నెన్ని నిషేధాలు ఉన్నా, కోర్టుల ఆదేశాలు ఉన్నా జల్లికట్టు అక్కడ జరిగితీరాల్సిందే. జంతువులకే కాదు మనుషుల ప్రాణాలకూ ముప్పు అని తెలిసినా తమిళనాడు వాసులు మాత్రం దానిని జరుపుకుని తీరుతారు. మరి ఈ పండగ చరిత్ర గురించి ఓ సారి తెలుసుకుందాం.

జల్లికట్టు ఆచారం ఈనాటిది కాదు. తమిళనాడులో తరతరాలుగా ఉన్నదే. పొంగల్ (Pongal Fest)పండుగ సీజన్‌లో కనుమ (Kanuma)రోజున ఈ సాహస పోటీలు జరుగుతుంటాయి. క్రీస్తు పూర్వం 400 ఏళ్ల సమయంలో జల్లికట్టు నిర్వహించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సల్లి, కట్టు... ఈ రెండు పదాల కలయికే చివరకు జల్లికట్టు అని మారింది. ఇది ఎద్దుల కొమ్ములతో ముడిపడిన వెండి లేదా బంగారు నాణేలను సూచిస్తుంది.

Here's ANI Tweet

అమిత్ షా.. బలవంతంగా హిందీని మాపై రుద్దవద్దు, తమిళులు హిందీ అంగీకరించే ప్రసక్తే లేదు

పురుషులందరూ జల్లి కట్టు ఆట ద్వారా తమ ధైర్యాన్ని, బలాన్ని చాటి చెప్పేందుకు దీన్ని వేదికగా చేసుకునేవారు. ఈ పోటీలో ఎవరైతే విజేతగా నిలుస్తారో వారిని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు క్యూ కట్టేవారట. ప్రస్తుతం జల్లి కట్టులో విజేతగా నిలిచిన వారికి బంగారం, నగదు వంటి బహుమతులు ఇస్తున్నారు.

Traditional bull taming fest

సంక్రాంతి పండుగకు ముందు బుల్ టామింగ్ క్రీడ(bull taming fest ) జల్లికట్టుపై తీర్పు వెలువరించాలని విజ్ఞప్తి చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జనవరి 3 న తిరస్కరించింది. జల్లికట్టు అనుకూల ప్రదర్శనను విద్యార్థులు నిర్వహించడంతో ఈ నిర్ణయం తమిళనాడు అంతటా విస్తృత నిరసనలకు దారితీసింది.

Here's ANI Tweet

జల్లికట్టు సంప్రదాయం పేరుతో పశువులను హింసిస్తున్నారని జంతు ప్రేమికులు ఎప్పట్నుంచో వాదిస్తున్నారు. దీంతో సుప్రీం కోర్టు (Supreme Court) జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రమాదకర ఆటపై నిషేధం కూడా విధించింది.సంప్రదాయ వేడుక అయిన జల్లికట్టును కొనసాగించాలంటే అనేక సంస్థలు పోరాటాలు మొదలుపెట్టాయి. తమిళ ప్రజలు సైతం జల్లికట్టు ఉండాల్సిందే అని కోరుకున్నాయి. ఏకంగా రోడ్ల మీదకొచ్చి ధర్నాలకు దిగాయి.

govt has passed an order permitting  jallikattu

చెన్నైలోని మెరీనా బీచ్‌లో(Marina Beach) పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్ పాటించారు. దీంతో తమిళనాడు సర్కార్ దిగివచ్చింది.జంతు హింస నిరోధక చట్టం-1960'లో సవరణలు చేస్తూ బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. అలా వేల ఏళ్ల నాటి జల్లికట్టు సంప్రదాయానికి అడ్డంకులు తొలగిపోయాయి. పొంగల్ సమయంలో జల్లికట్టు యథావిథిగా సాగుతోంది.

మదురై సమీపంలో ఒక పురాతన గుహ చిత్రలేఖనం కనుగొనబడిన తరువాత, కనీసం 2,500 సంవత్సరాల క్రితం జల్లికట్టు సాధన చేయబడిందని నమ్ముతారు, ఈ చిత్రం ఓ ఒంటరి వ్యక్తి ఎద్దును మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా చిత్రీకరించబడింది.

DMK Tweet On Jallikattu

తదనంతరం అది పోటీగా రూపాంతరం చెందింది. జల్లికట్టు యొక్క ప్రధాన లక్ష్యం ఎద్దును మచ్చిక చేసుకోవడం. సల్లి కట్టు అంటే ఎద్దు కొమ్ములు లేదా మెడను బంగారంతో అలంకరిస్తారు. ఎద్దుతో పోరాడి ఎవరు ఆ బంగారాన్ని తీసుకొస్తారో వాళ్లే ఈ పోటీలో విజేత.

రక్తమోడిన భక్తి, కర్రల సమరంలో 60మందికి పైగా గాయాలు

జల్లికట్టులో రంగంలోకి దించే ఎద్దుల్ని చాలా ముందు నుంచే ప్రిపేర్ చేస్తారు. ఎద్దు బలంగా, ఆరోగ్యంగా, దూకుడుగా ఉండేలా దాణా తినిపిస్తారు. సంక్రాంతికి కోస్తాంధ్రలో కోళ్లపందేలకు కోళ్లను ఎలా సిద్ధం చేస్తారో, తమిళనాట జల్లికట్టు కోసం ఎద్దులను సిద్ధం చేస్తారు. ఆ తర్వాత వాటిని పోటీలోకి దించుతారు.

నిఘా నేత్రంలో బన్ని ఉత్సవాలు

ఓ బహిరంగ మైదానంలో 50 అడుగుల పొడవైన తాడుతో ఎద్దును కట్టేస్తారు. ఆటగాళ్ళు ఒక నిర్దిష్ట కాలపరిమితిలో ఈ ఎద్దును లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇదే గేమ్.. ఈ పోటీలో యువకులు మరణించిన ఘటనలతో పాటు, జంతువులు గాయపడ్డ ఘటనలూ ఉన్నాయి.

ఈ జల్లి కట్టు వంటి ఆట విదేశాల్లోనూ ప్రముఖ క్రీడగా ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా స్పెయిన్, పోర్చుగల్ మరియు మెక్సికోలలో , బుల్ వార్ ఇప్పటికే జాతీయ వినోద క్రీడగా వర్థిల్లుతోంది. ఈ ఆట ప్రకారం ఎద్దులను అరేనాలోకి నెట్టేవేస్తారు.వాటిని చంపేయడమే వారి లక్ష్యం. ఎద్దుల పోరాటం మరియు వధ అనేవి ఒకేలా అనిపించవచ్చు. కానీ ఈ రెండు పూర్తిగా భిన్నమైనవి.