Srinagar, February 16: జమ్మూకాశ్మీర్ లో (Jammu And Kashmir) మళ్లీ ఇంటర్నెట్ సేవలు బంద్ (Internet Ban) అయ్యాయి. గతంలో కూడా ఓసారి బంద్ అయిన సంగతి విదితమే. తాజాగా నిఘా వర్గాలు నుంచి వచ్చిన రిపోర్ట్‌ల ప్రకారం 3జీ, 4జీ సేవలను ( 3G, 4G Internet Services) ఫిబ్రవరి 24వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు జమ్మూ కశ్మీర్ ప్రకటించింది. పోర్న్ సినిమాల కోసమే అక్కడ ఇంటర్నెట్
జమ్మూ కాశ్మీర్‌లో హైస్పీడ్ 3 జి, 4 జి ఇంటర్నెట్ సేవలను నిషేధించినట్లు వెల్లడించింది. 2జీ ఇంటర్నెట్ సేవలు, 1400+ వైట్‌లిస్ట్ వెబ్‌సైట్‌లతో పనిచేస్తూనే ఉంటాయని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తెలిపింది.
5 నెలల తర్వాత జమ్మూకశ్మీర్‌లో ప్రారంభమైన ఇంటర్నెట్ సేవలు
జమ్మూ కశ్మీర్‌లో ఈ డేటాను తాత్కాలికంగా నిలిపివేయడంపై స్పష్టం చేస్తూ, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. సాధారణ ప్రజలను ప్రభావితం చేసే పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని, తద్వారా ప్రజా శాంతికి భంగం కలిగించే ప్రయత్నాలు జరిగినట్లు ఇంటెలిజెన్స్ చెప్పిందని, అందుకే మొబైల్ డేటాపై తాత్కాలిక నిషేదం విధించినట్లు చెప్పింది. పుకార్ల ద్వారా జమ్మూలో శాంతి భద్రతలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని తెలిపింది.
కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించిన జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్
దీంతో పాటు 2జీ ఇంటర్నెట్ సదుపాయం ఉన్న వ్యక్తులు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమైన రెచ్చగొట్టే విషయాలను ప్రచారం చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన జనవరి 24న ఆంక్షలను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ ఫిబ్రవరి 24వ తేదీ వరకు 3జీ, 4జీ వంటి అందుబాటులో ఉండవు.