Ranchi, Sep 23: తన మాజీ ప్రియురాలి నగ్న చిత్రాలను (Nude Pictures of Woman) సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినందుకు స్కెచ్ ఆర్టిస్ట్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. నిందితుడిని జార్ఖండ్‌లోని రాంచీలోని డోరండా నివాసి మహ్మద్ తంజీమ్ అహ్మద్ (22)గా గుర్తించారు.బాధితురాలు సైబర్ నార్త్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె తన ఫిర్యాదులో, అతని స్కెచ్ ఆర్ట్ మరియు సోషల్ మీడియాలో ఆకట్టుకునే ఫాలోవర్ల సంఖ్యను చూసి తాను ప్రభావితమయ్యానని తెలిపింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన నిందితుడితో సంబంధం పెట్టుకున్నానని ఆమె తెలిపింది.
క్రమంగా, ఆమె అతనితో చాట్ చేయడం ప్రారంభించింది. కొంత సమయం తర్వాత అతని బలవంతం చేయడంతో అతనితో తన ప్రైవేట్ చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అయితే కొన్ని రోజుల తర్వా వీరిద్దరూ కలుసుకున్నారు. ఆ సమయంలో నిందితుడి ఫోన్ చెక్ చేయగా అందులో తన నగ్న చిత్రాలు గూగుల్ డ్రైవ్ లో సేవ్ అయి ఉండటం గమనించింది. పంపిన ఫోటోలను డిలీట్ చేయలేదని కోపగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అతన్ని దూరం పెట్టింది.
అయితే ఆమె దూరం పెట్టడం అహ్మద్‌కు కోపం తెప్పించింది. దీంతో అతను మహిళ యొక్క ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ (Uploaded On Social Media) చేసాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) సాగర్ సింగ్ కల్సి మాట్లాడుతూ, "విచారణ సమయంలో, నిందితుల సోషల్ మీడియా ఖాతాల వివరాలతో సహా అన్ని సమాచారాన్ని ఫిర్యాదుదారు నుండి సేకరించారు. సాంకేతిక దర్యాప్తు ఆధారంగా, నిందితుడిని గుర్తించామని తెలిపారు. అతన్ని జామా మసీదు ప్రాంతంలో గుర్తించి, సమగ్ర విచారణ అనంతరం నిందితుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో, నేరానికి ఉపయోగించిన సిమ్ కార్డ్ మరియు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.