Jamtara, July 18: జార్ఘండ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. తన భర్త జీన్స్ వేసుకోవద్దని ఆగ్రహించిన భార్య అతడిని చంపేసింది. జార్ఖండ్‌లోని జమ్తారాలోని జోర్భితా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఘండ్‌కి చెందిన ఒక జంట గోపాల్‌పూర్ గ్రామంలో జరిగే జాతర చూసేందుకు వెళ్లింది. ఐతే ఆ జాతర చూసి ఇంటికి తిరిగి వచ్చాక భార్యభర్తలిద్దరూ తీవ్ర స్థాయిలో గొడవపడ్డారు. ఇంతకీ ఆ దపంతులకు గొడవకు కారణం జీన్స్ వస్తధారణ. ఆమె జీన్స్ ధరించి జాతరకు వచ్చిందని భర్త ఆమెను దూషించడం మొదలు పెట్టాడు. అయినా పెళ్లి తర్వాత మహిళలు జీన్స్ ధరించకూడదంటూ (he denies her permission to wear jeans) భార్యతో తీవ్ర స్థాయిలో గొడవపడ్డాడు.
తన భర్త తీరుకి కోపంతో ఊగిపోయిన అతడి భార్య కత్తి తీసుకుని అతని పై దాడి (woman kills husband) చేసింది. దీంతో వెంటనే అతడి కుటుంబసభ్యులు హుటాహటినా ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు బాధితుడి తండ్రి కర్ణేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది.
జీన్స్ విషయంలో కొడుకు కోడలు మధ్య వాగ్వాదం వచ్చిందని, ఆ కోపంలోనే తన కోడలు కొడుకుని చంపేసిందని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ధన్‌బాద్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు జమ్తారా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) అబ్దుల్ రెహమాన్ తెలిపారు. ఈ విషయంపై విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.