New Delhi, December 13: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (60) కరోనావైరస్ బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ (JP Nadda Tests COVID-19 Positive) అయినట్టు ఆయనే స్వయంగా ట్విటర్‌లో ఆదివారం సాయంత్రం వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు (Covid Tests) చేయించుకోవాలని ఆయన సూచించారు. వైద్యుల సలహాలు, కరోనా మార్గదర్శకాలను పూర్తిగా పాటిస్తున్నాను. నాతో పాటు కాంటాక్ట్‌లోకి వచ్చిన వారందరూ దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని జేపీ నడ్డా ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
కాగా, ‘గెట్ వెల్ సూన్ సర్’ అంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. జేపీ నడ్డా త్వరగా కోలుకోవాలని బీజేపీ నేతలు.. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, జ్యోతిరాదిత్య సింధియా ట్విటర్ వేదికగా ఆకాక్షించారు. ఇక పార్టీ సీనియర్ నేతలు హోంమంత్రి అమిత్ షా, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ గత నెలలో కరోనాబారినపడి కోలుకున్నారు.
దేశంలో తాజాగా 30,254 కోవిడ్ కేసులు, 1,43,019కు చేరుకున్న మరణాల సంఖ్య, తెలంగాణ
దేశంలో గత 24 గంటల్లో 30,254 కొత్త కరోనా కేసులు (COVID-19 in India) నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 98,57,029కు (Coronavirus Pandemic) చేరుకుందని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనావైరస్ కారణంగా కొత్తగా 391 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,43,019కు (Covid Deaths) చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కొత్తగా 33,196 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 93,57,464కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 94.93శాతానికి చేరింది. దేశంలో ప్రస్తుతం 3,56,546 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో మరణాల రేటు 1.45 శాతంగా ఉంది.