K Arjunan abuses, kicks cop near Salem (Photo Credits: ANI)

Salem, June 29: తమిళనాడులోని సేలంలో ఓ పోలీసు అధికారిని మాజీ ఎంపీ, డీఎంకే నేత కె.అర్జునన్ (Former DMK MP K Arjunan) కాలితో తన్నుతూ రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కింది. కొవిడ్‌-19 వ్యాప్తి కట్టడిలో భాగంగా అక్కడి చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తోన్న పోలీసులు.. అర్జునన్‌ వెళ్తున్న వాహనాన్ని ఆపి ఈ-పాస్ (E-Pass) చూపించాలని అడిగారు. దీంతో ఆ మాజీ ఎంపీకి చిర్రెత్తుకొచ్చింది. నన్నే ఆపుతావా? అంటూ పోలీసులతో గొడవకు దిగారు. 24 గంటల్లో 19 వేల కేసులు నమోదు, దేశంలో 5.5 లక్షలకు చేరువలో కరోనా కేసులు, ఒకే రోజు 380 మంది కరోనాతో మరణం

పరుష పదజాలంతో దూషిస్తూ పోలీసులతో వాగ్వివాదానికి దిగి తిరిగి వెళ్లి కారులో కూర్చుకున్నారు. అయితే, ఆగ్రహం తగ్గకపోవడంతో మళ్లీ కారు దిగి దూసుకొచ్చి, దాడి చేశారు. కొంత మంది వారి మధ్య జరుగుతున్న ఘర్షణను అడ్డుకున్నారు.

బయటకు వచ్చిన వీడియో ప్రకారం.. ద్రావిడ మున్నేత కజగం (DMK) మాజీ ఎంపి కె అర్జునన్ (K Arjunan) టోల్ గేట్ వద్ద డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందిని నెట్టడం తన్నడం మాటలతో దుర్భషలాడుతూ కనిపించారు. అయితే దీనిపై ఇంకా ఎటువంటి కేసు నమోదు కాలేదు. కాగా తమిళనాడు రాష్ట్రంలో (Tamil Nadu) లాక్డౌన్ పరిమితుల కారణంగా, ఒక నగరం నుండి మరొక నగరానికి ప్రయాణించేటప్పుడు పౌరులు ఇ-పాస్ తీసుకెళ్లడం తప్పనిసరిని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Here's ANI Tweet

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి జూన్ 19 నుండి తమిళనాడు ప్రభుత్వం చెన్నై, చెంగల్‌పేట్, కాంచీపురం మరియు తిరువల్లూరు అనే నాలుగు జిల్లాల్లో పూర్తి లాక్డౌన్ ప్రకటించింది. తమిళనాడులో కొత్తగా 3,940 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు, 54 మరణాలు సంభవించాయని, మొత్తం కేసుల సంఖ్య 82,275 గా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.