Representative Image of Supreme Court ( Photo Credits: Wikimedia Commons )

Chennai, Juy 19: తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన పాఠశాల విద్యార్థి ఆత్మహత్య కేసుకి (Kallakurichi Girl Suicide Case) సంబంధించి ఘటన జరిగిన మరుసటి రోజే మద్రాస్‌ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థి మృతిని నిరశిస్తూ మరోసారి పోస్ట్‌మార్టం (2nd Post-Mortem) నిర్వహించాలని ఆదేశించింది. అంతేగాక అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఐతే మెడికల్‌ ప్యానెల్‌లో తమకు తెలిసిన వైద్యుడిని చేర్చాలన్న తల్లిదండ్రుల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. తమకు తెలిసిన వైద్యుడితోనే శవపరీక్షలు నిర్వహించాలంటూ బాలిక తండ్రి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అంతేగాదు ఈ కేసును అత్యవసరంగా విచారించాలంటూ సుప్రీంకోర్టుని బాలిక కుటుంబం పట్టుబట్టింది. ఐతే ధర్మాసనం రెండోసారి నిర్వహించే పోస్ట్‌మార్టం పై స్టే ఇచ్చేందుకు నిరాకరిచడమే కాకుండా (Supreme Court Declines Father’s Plea ) రేపు విచారణ జరుపుతామని తెలిపింది. ఐతే బాలిక తండ్రి తరపు న్యాయవాది రాష్ట్రంలో ఈ విషయమై చాలా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది, పైగా ఈ రోజే పోస్ట్‌మార్టం ప్రారంభమవుతుంది కాబట్టి దయచేసి దానిపై స్టే విధించండి అంటూ పట్టుబట్టారు.

ఉపాధ్యాయులు టార్చర్ తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య, ఇద్దరు టీచర్లను అరెస్ట్ చేసిన పోలీసులు, తమిళనాడు వ్యాప్తంగా కలకలం రేపుతున్న విద్యార్థి ఆత్మహత్య ఘటన

దీనికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమణ స్పందిస్తూ...‘ఈ అంశాన్ని ఇప్పటికే హైకోర్టు సీజ్ చేసింది. మీకు హైకోర్టుపై నమ్మకం లేదా? అని మందలించడమే కాకుండా వారి అభ్యర్థనను తిరస్కరించారు. అదీగాక మద్రాస్‌ హైకోర్టు ఆదేశాల మేరకు అల్లర్లకు సంబంధించి దాదాపు 300 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.