SC on Kanwar Yatra Nameplate Controversy: కన్వరీ యాత్రా (Kanwari Yatra) మార్గంలోని స్టాల్స్, హోటళ్ల యజమానులు ఆయా స్టాల్స్, హోటల్స్ నేమ్ ప్లేట్స్‌పై తమ పేర్లును వేయించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు జారీచేసిన నిర్దేశాలపై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించింది. యజమానులు వారు వడ్డించే ఆహారాన్ని మాత్రమే ప్రదర్శిస్తారని స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను శుక్రవారానికి (జూలై 26) వాయిదా వేసింది. ప్రభుత్వాల ఆదేశాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యాయమూర్తులు జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ ఈ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సమాధానమివ్వాలని కోరింది. ఆహార విక్రయదారులు యజమానులు, ఉద్యోగుల పేర్లు రాయాలని బలవంతం చేయరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆర్థిక సర్వే హైలెట్స్ ఇవిగో, వ్యవసాయంపై మరింత దృష్టి సారించాలని తెలిపిన కేంద్ర మంత్రి, ఎఫ్‌వై24లో 5.4 శాతానికి తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం
కాగా కన్వరీ యాత్రా మార్గంలోని స్టాల్స్, హోటల్స్ యజమానులు ఆయా స్టాల్స్, హోటల్స్ నేమ్ ప్లేట్లపై తమ పేర్లను వేయించాలని ముందుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశాలు జారీచేసింది. ఆ తర్వాత ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఉత్తరప్రదేశ్ తరహాలోనే నిర్దేశాలు జారీ చేశాయి. దాంతో ఈ నిర్దేశాలను సవాల్ చేస్తూ పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్‌లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్, నీట్ అవకతవకలపై మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టిన ఇండియా కూటమి, బడ్జెట్ సమావేశాలు హైలెట్స్ ఇవిగో..
విచారణలో ధర్మాసనం "ప్రభుత్వాల ఆదేశాలను అమలు చేయడాన్ని నిషేధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సముచితమని మేం భావిస్తున్నాం. దుకాణదారులు ఆహార పదార్థాలను షాప్ బయట ప్రదర్శించాలి. కానీ యజమానులు, సిబ్బంది పేర్లను ప్రదర్శించమని బలవంతం చేయకూడదు. ప్రభుత్వాల నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ సర్కార్‌లు సమాధానం చెప్పాలి " అని బెంచ్ పేర్కొంది.
కావడి యాత్ర అంటే ఏమిటీ ?
ఏటా శ్రావణమాసంలో చేపట్టే కావడి యాత్రలో భాగంగా శివభక్తులు నెల రోజులపాటు గంగానది జలాలను కావిళ్లతో సేకరించి స్వస్థలాలకు తరలిస్తారు. ఈ ఏడాది యాత్ర నేటి నుండి ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఈ యాత్ర కోసం పటిష్ఠ భద్రతను ఏర్పాటుచేశాయి. అయితే దుకాణాల యజమానులు తమ పేర్లు ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మైనారిటీలపై జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తున్నాయి.భారత సంస్కృతిపై ఇదొక దాడి అని కాంగ్రెస్ విరుచుకుపడింది.