Apple iPhone (Photo Credits: Twitter)

Bengaluru, December 14: కర్ణాటకలోని యాపిల్‌ ఐఫోన్‌ తయారీ ప్లాంట్‌లో కాంట్రాక్టు ఉద్యోగులు విధ్వంసానికి (Karnakata Apple iPhone Plant Violence) పాల్పడ్డారు. వేతనాలు చెల్లించలేదనే ఆగ్రహం‍తో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ప్లాంట్‌పై దాడి చేశారు. కోలార్ జిల్లాలోని నర్సాపురలో తైవాన్‌కు చెందిన టెక్‌ దిగ్గజం విస్ట్రాన్ కార్పొరేషన్‌ ఐఫోన్‌ తయారీ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది. డిసెంబర్ 12న కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని ప్లాంట్‌లో ఉద్యోగులు సృష్టించిన విధ్వంసంలో తమకు 440 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తైవానకు చెందిన విస్ట్రాన్ కార్పొరేషన్ (Wistron Corporation) తాజాగా ప్రకటించింది. అసెంబ్లింగ్‌ పరికరాలు, బయోటెక్ డివైజ్‌లు ఇతర పరికరాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. అంతేకాదు వేలాది ఐఫోన్లు ఎత్తుకుపోయారని (iPhones Were Stolen During Rampage) ఆరోపించారు.

నాలుగు ఎంట్రెన్స్ గేట్ల‌ను కూల్చేసి లోప‌లికి వ‌చ్చిన ఉద్యోగులు ఆ త‌ర్వాత హెచ్ఆర్ ఆఫీసును ధ్వంసం చేశారు. ఆదివారం రోజున ఈ కేసులో సుమారు 128 మందిని అరెస్టు చేశారు. కంపెనీతో సంబంధం లేని కొంద‌రు రాడ‌ల్లు, క‌ర్ర‌ల‌తో వ‌చ్చి హెచ్ఆర్ ఆఫీసును టార్గెట్ చేసిన‌ట్లు విస్ట్రాన్ కంపెనీ ఆఫీస‌ర్ ఆరోపించారు. ఆగ్ర‌హావేశాల‌తో వ‌చ్చిన కార్మికులు .. అక్క‌డ ఉన్న నాలుగు కార్లు, రెండు గోల్ఫ్ కార్ట్‌లకు నిప్పుపెట్టారు. దీని వ‌ల్ల 60 ల‌క్ష‌ల న‌ష్టం వాటిల్లింది.

కిటికీ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం, వాహనాలకు నిప్పంటిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో సుమారు 100 మందికిపైగా ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విధ్వంసంలో 700 కంప్యూటర్లు ధ్వంసమైనాయనీ, సుమారు రూ.40కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించిందని మొదట అంచనా వేశారు. 100 కోట్ల రూపాయల లోపు నష్టాలు సంభవించవచ్చని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు

శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుంచే ఉద్యోగులు కంపెనీని ఉన్నత స్థితిలోకి తీసుకువస్తున్నారంటున్న ఐటీ కంపెనీలు, దీనికి తోడవుతున్న కోవిడ్ సెకండ్ వేవ్ భయం

నాలుగు నెల‌లుగా జీతాలు లేని కాంట్రాక్టు కార్మికులు.. విస్ట్రాన్ కంపెనీపై దాడి చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. విస్ట్రాన్ కంపెనీలో సుమారు 15వేల మంది ఉద్యోగులు ఉన్నారు. కానీ వారిలో 1400 మందికి మాత్ర‌మే పేరోల్ ఉన్న‌ది. బెంగుళూరు కంపెనీలో హింస చెల‌రేగిన అంశాన్ని విచారిస్తున్న‌ట్లు ఆపిల్ సంస్థ పేర్కొన్న‌ది. తైవాన్ కాంట్రాక్ట‌ర్ విస్ట్రాన్ కార్ప్‌ను విచారిస్తున్నామ‌ని, త‌మ స‌ప్ల‌య్ చైన్‌లో ప్ర‌తి ఒక్క‌ర్నీ గౌర‌వంగా చూస్తామ‌ని, స్థానికంగా ఉన్న త‌మ బృందాలు అక్క‌డ విచార‌ణ చేప‌డుతున్న‌ట్లు ఐఫోన్ కంపెనీ ప్ర‌తినిధి ఒక‌రు వెల్ల‌డించారు.

ఈ ఘటనను కర్ణాటక ప్రభుత్వంపై స్పందించింది. విస్ట్రాన్, కాంట్రాక్టు కార్మికుల మధ్య వివాదం మూడు నెలలుగా కొనసాగుతోందని తెలిపింది. విస్ట్రాన్ తన కోలార్ యూనిట్ కోసం 8,900 మందిని నియమించుకోవడానికి ఆరు అనుబంధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు రాష్ట్ర కార్మిక మంత్రి శివరామ్ హెబ్బర్ తెలిపారు. అయితే ఈ నియామకాలకు సంబంధించి విస్ట్రాన్, కాంట్రాక్టర్లు,ఉద్యోగుల మధ్య ఏర్పడిన వివాదమే హింసకు కారణమై ఉండవచ్చని పరిశ్రమల మంత్రి జగదీష్ శెట్టర్ వ్యాఖ్యానించారు.