Bengaluru, Dec 14: కర్ణాటక బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రీతి కుశ్వాహా అనే 33 ఏళ్ల మహిళ తన భర్తకు తెలియకుండా అబార్షన్ మాత్ర (Abortion Pill in Bengaluru) తీసుకుంది. దీని వల్ల సమస్యలు తలెత్తి తీవ్ర రక్తస్రావమైంది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు (33-Year-Old Pregnant Woman Dies ) వైద్యులు ప్రకటించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దంపతులకు 11 నెలల చిన్నారి ఉంది. అయితే ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించగా ప్రీతి మళ్లీ గర్బం దాల్చినట్లు తేలింది.
ఇప్పటికే చిన్న పాప ఉన్నందున ఇంత త్వరగా మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆమె ఆసక్తి చూపలేదు. అబార్షన్ చేయించుకుంటానని భర్తకు చెప్పగా.. అందుకు అతను ఒప్పుకోలేదు.దీంతో సోమవారం సాయత్రం భర్త బయటకు వాకింగ్‌కు వెళ్లినప్పుడు ప్రీతి అబార్షన్ మాత్ర తెచ్చుకుని వేసుకుంది. దీంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. భరించలేని కడుపునొప్పితో పాటు రక్తస్రావమైంది. భర్త ఆస్పత్రికి తీసుకెళ్తానంటే ఆమె వద్దంది.
కానీ మంగళవారం ఉదయం ప్రీతి స్పృహ తప్పి పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమె భర్త హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. అయితే ప్రీతి అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించడంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు.ఈ ఘటనపై పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అబార్షన్ మాత్ర వల్లే మహిళ చనిపోయినట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు.