Representative Photo (Photo Credit: PTI)

Bengaluru, Jan 10: కర్ణాటక రాజధాని బెంగుళూరులో విషాదకర ఘటర చోటుచేసుకుంది. నిర్మాణ దశలో ఉన్న మెట్రో పిల్లర్‌ కూలి (Metro Pillar collapse) తల్లీ, కుమారుడు మృతి (Mother-son duo killed) చెందారు. ఈ ఘటన నగవర ప్రాంతంలో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేజస్వీ(25) అనే మహిళ తన భర్త లోహిత్‌, రెండున్నరేళ్ల కూమార్తె, కుమారుడు విహాన్‌తో కలిసి ద్విచక్రవాహనంపై హెబ్బాల్‌ వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో కళ్యాణ్‌ నగర్‌ నుంచి హెచ్‌ఆర్‌బీర్‌ లేఅవుట్‌ వరకు చేపట్టిన నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్‌ కుప్పకూలి (Metro pillar collapse in Bengaluru) రోడ్డు మీద పడింది.

12 ఏళ్లకే గుండెపోటు, నిద్రలోనే ఉలిక్కిపడిలేచి విలవిలలాడిన చిన్నారి, ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే కన్నుమూత

బైక్‌పై వెళ్తున్న కుటుంబంపై ఇనుప రాడ్‌లతో కూడిన మెట్రో పిల్లర్‌ పడటంతో వారు తీవ్ర గాయపడ్డారు. ముగ్గురుని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వివాహితతోపాటు ఆమె మూడేళ్ల కుమారుడు మరణించారు. తేజశ్విని భర్త, కుమార్తె చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. మెట్రో పిల్లర్‌ కూలడంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

దేశంలో మరో XBB 1.5 స్ట్రెయిన్ కొత్త కేసు, ఎనిమిదికి చేరుకున్న ఈ వేరియంట్ మొత్తం కేసులు సంఖ్య, యునైటెడ్ స్టేట్స్‌లో కల్లోలం రేపిన COVID-19 XBB 1.5 స్ట్రెయిన్

‘ద్విచక్ర వాహనంపై వెళ్తోన్న నలుగురిపై ఈ పిల్లర్ పడిపోయింది. అందులో తల్లీకుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది’అని బెంగళూరు ఈస్ట్‌ పోలీసు డిప్యూటీ కమిషనర్‌ వెల్లడించారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విషాదంపై ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మీడియాతో మాట్లాడారు. ‘దీని గురించి ఇప్పుడే సమాచారం అందింది. ఈ ఘటనకు గల కారణాలపై విచారణకు ఆదేశించాం. బాధిత కుటుంబానికి పరిహారం అందజేస్తాం’అని వెల్లడించారు. బెంగళూరు మెట్రోరైల్ కార్పొరేషన్ లిమిటెడ్(BMRCL)రూ.20 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.