Covid-19 Patient Suicide: కరోనా సోకిందనే మనస్థాపంతో ఆత్మహత్య, బెంగుళూరులో విషాద ఘటన, కర్ణాటకలో 500 దాటిన కరోనా కేసులు
Representational Image (Photo Credits: ANI)

Bengaluru, April 27: కర్ణాటక రాజధాని బెంగళూరులో (Bengaluru) విషాదకర ఘటన చోటు చేసుకుంది. కరోనా బారిన పడి ట్రీట్​మెంట్ పొందుతున్న పేషెంట్ ఆస్పత్రి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు (Covid-19 Patient Suicide) పాల్పడ్డాడు. కరోనా సోకడంతో మనస్థాపం చెంది ఆస్పత్రి బిల్డింగ్ ఐదో ఫ్లోర్ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడని అక్కడి పోలీసులు సోమవారం వెల్లడించారు. లాక్‌డౌన్‌ కొనసాగించాలా, వద్దా అనేదానిపై మే 3 తర్వాత తుది నిర్ణయం, రాష్ట్రాల సీఎంలతో ముగిసిన ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

నగరంలోని విక్టోరియా ఆసుపత్రిలో (Victoria Hospital Bangalore) ఈ ఉదయం 8.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఆసుసత్రిలోని ట్రామా వార్డు నుంచి మృతుడు దూకాడని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తొలి అంతస్తు రూఫ్ టాప్ పై మృతదేహం లభ్యమైందని చెప్పారు. వైద్యులు వెల్లడించిన సమాచారం ప్రకారం... తీవ్రమైన శ్వాసకోస సమస్యలతో (pneumonia) శుక్రవారం నాడు ఆసుపత్రిలో ఆయన చేరారని తెలిపారు.

కిడ్నీ సంబంధిత ఇబ్బందులు కూడా ఆయనకు ఉన్నాయని... పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటవ్ నిర్ధారణ అయిందని చెప్పారు. డెడ్ బాడీని అన్ని జాగ్రత్తలతో మార్చురీకి తరలించామని డాక్టర్లు వివరించారు. వైరస్ సోకిన వారికి ఆరోగ్య సేవలతో పాటు మానసిక ఒత్తిడి తగ్గేలా కౌన్సెలింగ్ కూడా అవసరమని వారు చెబుతున్నారు.  లాక్‌డౌన్ కొనసాగింపుకే ప్రధాని మొగ్గు చూపారా?, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్, తుది నిర్ణయం ఎప్పుడంటే...?

మరోవైపు, కర్ణాటకలో ఇప్పటి వరకు 500కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం సాయంత్రం ఐదు గంట‌ల నుంచి సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు అక్క‌డ కొత్త‌గా ఎనిమిది క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 511కు చేరింది. కరోనా వ్యాక్సిన్ కోసం 11 నెలలు ఆగాల్సిందే, సెప్టెంబర్‌లో వ్యాక్సిన్ ఉత్పత్తి సాధ్యం కాదు, బిల్ గేట్స్ కీలక ప్రకటన, ఏడు ప‌రిశోధ‌న బృందాల‌కు భారీగా నిధులు

అయితే మొత్తం కేసుల్లో 188 మంది వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యార‌ని, 19 మంది మ‌ర‌ణించార‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం 304 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని, వారంతా వివిధ ఆస్ప‌త్రుల్లో ఐసోలేష‌న్ వార్డుల్లో చికిత్స పొందుతున్నార‌ని తెలిపింది. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో గోడలు, స్థానికుల మండిపాటు, తమిళనాడు అధికారులతో చ‌ర్చించనున్న ఏపీ అధికారులు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా అనుమానితుడొకరు ఐసోలేషన్ వార్డు తలుపులు బలవంతంగా తెరిచి ఆసుపత్రిలోని ఏడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. మ‌హారాష్ట్రలో క‌రోనా పాజిటివ్ అని తేలడంతో మ‌నస్థాపానికి గురైన ఓ వ్య‌క్తి ఆత్మ‌హత్య చేసుకున్నారు. అకోలా జిల్లాలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. బ‌తుకుదెరువు కోసం అసోం నుంచి వ‌ల‌స‌ వ‌చ్చిన ఓ వ్య‌క్తి కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయాడు.