Image used for representational purpose | (Photo Credits: PTI)

Bengaluru, Oct 25: కర్ణాటక రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తన భార్య మ్యూకోర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) వ్యాధితో మరణిచడంతో ఆమె మరణాన్ని తట్టుకోలేక (Depressed after losing wife to Black Fungus) పోయిన 46 ఏళ్ల భర్త ఈ లోకాన్ని విడిచాడు. తనతో పాటు తన నలుగురి పిల్లలను కూడా తీసుకుపోయాడు. ఎక్స్‌ ఆర్మీ మ్యాన్‌ తన భార్య మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురై తన నలుగురి పిల్లలకు విషం ఇచ్చి (Ex-Army man poisons his kids, ends life), తాను చనిపోయాడు. ఈ ఘటన సంకేశ్వరంలోని బోర్గల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ మేరకు చనిపోయిన వ్యక్తి గోపాల్ హదీమణిగా పిల్లలు సౌమ్య, శ్వేత, సాక్షి, సృజన్‌లుగా గుర్తించారు. హదీమణి మూడేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అతని భార్య జయ జూలై 6న కోవిడ్‌ కారణంగా బ్లాక్‌ ఫంగస్‌తో చనిపోవడంతో గోపాల్‌ ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు సందేహం వ్యకం చేస్తున్నారు. అంతేకాదు గోపాల్‌ భార్య మరణంతో చాలా ఆవేదన చెందాడని, పైగా అప్పటి నుంచి పెద్దగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాడంటూ బాధితుడి బంధువులు చెబుతున్నారని పోలీసులు అన్నారు. ఈ మేరకు ఇరుగుపొరుగు వచ్చి తలుపులు కొట్టిన పలకక పోవడంతో అనుమానం వచ్చి తలుపులు పగలుకొట్టి చూస్తే గోపాల్‌, అతని పిల్లలు చనిపోయి ఉన్నారని వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కీసర దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం, హైదరాబాద్‌ సైబర్‌ క్రైం ఏసీపీ కుటుంబ సభ్యులు ముగ్గురు మృతి, చీరాలలో వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం

ఆమెకు కోవిడ్ రావడం అది బ్లాక్ ఫంగస్ కు దారి తీయడంతో.. చికిత్స పొందుతూ జూలై 6 న మరణించింది. ఆ జిల్లా మంత్రి గోవింద్ కర్జోల్ మాట్లాడుతూ, "డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులు సహాయం కోరాలని మరియు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని నేను కోరుతున్నానని తెలిపారు.