 
                                                                 HYD, Oct 25: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కీసర మండలం యాదగిరిపల్లి వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై ( Hyderabad’s Outer Ring Road) సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident in HYD) చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన షిఫ్ట్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.
మృతుల్లో హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ సతీమణి శంకరమ్మ, ఆయన సోదరుడి కుమారుడు దంపతులు ఉన్నారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ప్రకాశం జిల్లా చీరాలలో వివాహ వేడుకకు వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఇక సంగీత్ కీస్ హై స్కూల్ వద్ద వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బైక్‌పై వెళుతున్న కూరగాయల వ్యాపారి శ్రీనివాస్ మృతి చెందాడు. బస్సు ఢీకొట్టడంతో చక్రాల కింద పడి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ చింతల మహేష్‌ను గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరో చోట రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హిమాయత్ సాగర్‌లో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడు బోయిన్ పల్లికి చెందిన నరేంద్ర కుమార్‌గా గుర్తించారు. తన సొంత ఆటోలో నిన్న ఉదయం నరేంద్ర ఇంటి నుంచి బయటకు వచ్చారు. నరేంద్రకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
