
Farmer Alleges Tomatoes Stolen Her Farm: జూలై 4వ తేదీన రాత్రి కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని తన పొలంలో రూ.2.5 లక్షల విలువైన టమోటాలు చోరీకి గురయ్యాయని రైతు ఆరోపించారు. బెంగళూరులో కిలో ధర రూ. 120కి చేరడంతో పంటను కోసి మార్కెట్‌కు తరలించాలని యోచిస్తున్నామని 2 ఎకరాల భూమిలో టమోటా సాగు చేసిన మహిళా రైతు ధరణి తెలిపారు.
శనగ పంటలో భారీ నష్టాలు చవిచూసి టమోటాలు పండించడానికి అప్పులు చేశాం. మాకు మంచి పంట వచ్చింది. ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి. 50-60 బస్తాల టమోటాలను తీసుకెళ్లడమే కాకుండా, మిగిలిన పంటను కూడా దొంగలు ధ్వంసం చేశారని ధరణి చెప్పారు. హళేబీడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.