Representational Image | (Photo Credits: IANS)

Bengaluru, Nov 4: రాజకీయనేతలు, ప్రముఖులే టార్గెట్‌గా అందమైన యువతులు హనీట్రాప్‌ వల వేస్తున్నారు. తాజాగా చిత్ర దుర్గ బీజేపీ ఎమ్మెల్యే జి.హెచ్‌. తిప్పారెడ్డికి (Karnataka MLA GH Thippareddy) భారీ షాక్‌ తగిలింది. ఓ యువతి వాట్సాప్‌ కాల్‌ చేసి న్యూడ్‌గా మాట్లాడటంతో ఖంగుతిన్న ఎమ్మెల్యే వెంటనే కాల్‌ కట్‌ చేశాడు.

ఎమ్మెల్యే తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటకలోని చిత్రదుర్గ ఎమ్మెల్యే జి.హెచ్‌. తిప్పారెడ్డి ఓ అపరిచిత యువతి నుంచి వీడియో కాల్ అందుకున్నాడు.ఆ యువతి తిప్పారెడ్డికి వాట్సాప్‌ కాల్‌ చేసి హనీట్రాప్‌ చేసేందుకు ప్రయత్నించింది. సదరు యువతి తనకు అక్టోబర్‌ 31వ తేదీన తనకు వీడియో కాల్‌ చేసిందన్నారు.ఈ గుర్తు తెలియని వాట్సాప్ వీడియో కాలర్ తన ప్రైవేట్ భాగాలను చూపిస్తూ కాల్ చేసిందని ఆరోపించాడు.

రసికుడంటే ఇతనే బాబోయ్, 61 ఏళ్ల వయసుకే 87 పెళ్లిళ్లు, తాజాగా తన మాజీ భార్యతో 88వ పెళ్లికి రెడీ అయిన ఇండోనేషియాకు చెందిన కాన్

అయితే, నియోజకవర్గానికి చెందిన వ్యక్తులెవరైనా తనకు కాల్‌ చేస్తున్నారని భావించిన ఆయన.. కాల్‌ లిఫ్ట్‌ చేయడంతో యువతి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిందన్నారు. ఈ క్రమంలో తన దుస్తులు విప్పేసి న్యూడ్‌గా (private parts) మాట్లాడే ప్రయత్నం చేసినట్టు తెలిపారు. తాను వెంటనే కాల్‌ కట్‌ చేసినట్టు చెప్పుకొచ్చారు.కాగా, మరికొద్ది క్షణాలు తర్వాత.. ఆమె మళ్లీ కాల్‌ చేసిందన్నారు. దీంతో, తన భార్యను కాల్‌ లిఫ్ట్‌ చేయమని చెప్పాను. అనంతరం, తన భార్య.. ఆ నంబర్‌ను బ్లాక్ చేసినట్టు చెప్పుకొచ్చారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ సలహా మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు (lodges complaint) చేసినట్లు తిప్పారెడ్డి తెలిపారు.