Cardiac Arrest (photo-Pixabay)

Passenger Dies of Heart Attack on KSRTC Bus Journey: మంగళూరు నుంచి మైసూరుకు కేఎస్‌ఆర్‌టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మైసూరుకు చెందిన ఓ ప్రయాణికుడు జూన్ 28వ తేదీ రాత్రి పుత్తూరులో గుండెపోటుతో మృతి చెందాడు. ఉదయవాణి వార్తా కథనం ప్రకారం.. మైసూరు హంచ్యా పోస్టల్ ఏరియాలోని మాన్సీ నగర్‌లో నివాసం ఉంటున్న 57 ఏళ్ల మంజునాథ్‌కు గుండె జబ్బులు ఉన్నాయి. ఇటీవల మైసూర్‌లోని జయదేవ్ హార్ట్ హాస్పిటల్‌లో రెండు రోజులుగా చికిత్స పొంది కోలుకున్నారు.  వీడియో ఇదిగో, బంతిని బలంగా బాది వెంటనే గుండెపోటుతో కుప్పకూలిన క్రికెట్ ప్లేయర్

28వ తేదీ సాయంత్రం మంజునాథ్ మైసూర్ వెళ్లేందుకు మంగళూరులో బస్సు ఎక్కాడు. బస్సు పుత్తూరు సమీపంలోకి రాగానే స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే కెఎస్‌ఆర్‌టిసి సిబ్బంది మరియు తోటి ప్రయాణికులు అతన్ని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించినప్పటికీ, అతను వచ్చేలోగా మరణించినట్లు ప్రకటించారు. మంజునాథ్ భార్య ఫిర్యాదు మేరకు పుత్తూరు నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.