Mysuru Road Accident: మైసూరులో ఘోర రోడ్డు ప్రమాదం, ఇన్నోవాను ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్ బస్సు, ఇద్దరు చిన్నారులతో సహా 10 మంది అక్కడికక్కడే మృతి
Road Accident (Representational Image)

Mysuru, May 29: కర్ణాటకలోని మైసూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు..ఇన్నోవా కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో పది మంది మృత్యువాతపడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదంలో మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మైసూరు జిల్లాలోని కొల్లేగల - టీ నర్సిపుర ప్రధాన రహదారిపై కురుబురు గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

కొడుకులు ఆస్తి కోసం గొడవ చేస్తారని భయం, చనిపోయిన భర్తకు ఇంట్లోనే అట్టపెట్టెలతో దహన సంస్కారాలు చేసిన భార్య, కర్నూలు జిల్లాలో షాకింగ్ ఘటన

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు బళ్లారికి చెందిన వారని, వారంతా మలే మాదేశ్వరుని దర్శించుకుని మైసూరు నగరానికి వస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో మృతదేహాలు ఇరుక్కుపోయి తీవ్రంగా చితికిపోయినట్లు కనిపించాయి.