Bengaluru, April 17: కర్ణాటకలో దారుణ ఘటన (Karnataka Shocker) చోటు చేసుకుంది. పోర్న్ సినిమాలు చూడ్డానికి బానిసగా మారిన ఓ వ్యక్తి అనుమానంతో తన అర్థాంగినే బలి తీసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. ఆటో డ్రైవర్ గా పనిచేసే జహీర్ పాషా ( Bengaluru auto driver) రెండు నెలల క్రితం మొబైల్ లో పోర్న్ చిత్రాన్ని చూశాడు. అందులో ఉన్న మహిళ తన భార్యేనన్న అనుమానం (assumes wife acted in porn movie) కలిగింది. అప్పటి నుంచి ఆమెను వేధించడం మొదలు పెట్టాడు.
వీరికి వివాహమై 15 ఏళ్లు కాగా, ఐదుగురు సంతానం కలిగారు. అందరూ కలిసే ఉంటున్నారు. రెండు నెలల క్రితం పోర్న్ వీడియోను చూసిన తర్వాత భార్యపై అనుమానంతో ఆమెను కొట్టాడు. 20 రోజుల క్రితం మరోసారి దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో ఆమె ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. దీన్ని తట్టుకోలేకపోయిన బాధితురాలి తండ్రి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయబోగా ఆమె అడ్డుకుంది. తాజాగా గత ఆదివారం జషీర్ పాషా తన భార్యపై పిల్లల ముందే కత్తితో దాడి (kills her in front of kids) చేశాడు.
అది చూసిన పాషా పెద్ద కుమారుడు తాత దగ్గరకు వెళ్లి చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. అయితే, వారు ఇంటికి వచ్చేసరికే ఆమె విగతజీవిగా పడి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.