Bengaluru, Feb 23: కర్ణాటక ఆర్టీసీ బస్సులో దారుణం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి విజయపుర నుంచి మంగళూరుకు వెళుతున్న కేఎస్‌ఆర్టీసీ స్లీపర్ బస్సులో ఓ వ్యక్తి తప్పతాగి పక్కసీటులో మూత్రం (Drunk man pees) పోశాడు. మార్గమధ్యంలో కిరేసూరు వద్ద భోజనం కోసం డ్రైవర్ బస్సును ఆపితే కొందరు దిగిపోయారు. 28వ సీటులో ఉన్న రామప్ప (25) అనే యువకుడు తన సీటు నుంచి లేచి వచ్చి 3వ నంబరు సీటులో కూర్చున్న ఒక యువతిపై మూత్ర విసర్జన చేశాడు.
భయపడిన ఆ యువతి కిందకు దిగి డాబాలో భోజనం చేస్తున్న డ్రైవర్, కండక్టర్‌కు విషయం తెలిపింది. డ్రైవర్, కండక్టర్ అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తానని అతడు చెప్పాడు. మద్యం మత్తులో ఇలా చేసి ఉంటాడని అనుమానించారు.కాగా మద్యం మత్తులో ఉన్న యువకుడిని సహ ప్రయాణికులతో బస్సు సిబ్బందితో కూడా దురుసుగా ప్రవర్తించాడు.
అతను అదుపు చేయలేకపోవడంతో అతన్ని అక్కడే దించేసి వెళ్లిపోయారు. KSRTC ప్రతినిధి ప్రకారం, మహిళా ప్రయాణికురాలు ఫిర్యాదు చేయడానికి నిరాకరించినందున సిబ్బంది ప్రయాణాన్ని కొనసాగించారు. బస్సు సిబ్బంది వెంటనే మహిళకు సహాయం చేసి ఆమె సీటును శుభ్రం చేశారు.విమానంలో ఓ వృద్ధురాలిపై బెంగళూరుకు చెందిన బడా కంపెనీ ఉన్నతాధికారి మద్యం మత్తులో మూత్రం పోయడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.