Kannur, August 30: బంగారం చాలా ఖరీదుగా మారింది. ఈ నేపథ్యంలో బంగారం స్మగ్లర్లు ( Gold smuggling ) బంగారాన్ని వివిధ రకాలుగా అక్రమంగా తరలిస్తున్నారు. అక్రమ రవాణా ద్వారా కోట్లు ఆర్జిస్తున్నారు. దేశంలోని ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు, కస్టమ్స్ ప్రివెంటివ్ యూనిట్‌లు, ఇతర సిబ్బంది కలిసి స్మగ్లింగ్ అడ్డుకట్టకి ఎంత పకడ్బంది చర్యలు తీసుకున్న నేరస్థులు సరికొత్త దారులను ఎంచుకుంటున్నారు.తాజాగా కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో ( Kannur Airport) ఓ వ్యక్తి 302 గ్రాముల బంగారం పేస్టుతో పట్టుబడ్డాడు. ఈ బంగారం ఖరీదు రూ. 14 లక్షలు (Gold Worth Rs 14 Lakh Seized at Kannur Airport) ఉంటుందని అంచనా.
బంగారాన్ని పేస్టుగా మార్చి రెండు పొరల ప్యాంట్ల మధ్యలో దాచుకుని వచ్చిన ప్రయాణికుడిని అధికారులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని సీజ్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టుగా మార్చి రెండు పొరల ప్యాంట్ల మధ్యలో దాచుకుని వచ్చాడు. అయితే ఆ ప్రయాణికుడి కదలికలు కాస్త అనుమానంగా ఉండడంతో అధికారులు గుర్తించి అతడిని తనిఖీ చేయగా అసలు నిజం బయటపడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు బంగారాన్ని సీజ్ చేశారు.
ఈ ఏడాది మార్చిలో విగ్గులో పెట్టి అక్రమ రవాణా చేస్తున్న బంగారాన్ని చెన్నై ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులు పట్టుకున్న విషయం విదితమే. అప్పుడు ఆరుగురిని అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5.55 కేజీల బంగారాన్ని, రూ.24 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ.2.53 కోట్లు ఉండొచ్చని అంచనా. నిందితులు విగ్గులు, సాక్సులు, లోదుస్తులు, మలద్వారం.. ఇలా వివిధ మార్గాల్లో బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించారని అధికారులు వెల్లడించారు.ఇక శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు లేడి వద్ద రూ.25.4 లక్షల విలువ చేసే 550 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. లో దుస్తుల్లో దాచిన బంగారాన్ని అధికారుల బృందం ఆమెతోనే తీయించారు.