Image used for representational purpose | (Photo Credits: File Image)

Kozhikode, October 21: కేర‌ళ‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 17 ఏండ్ల బాలిక‌పై న‌లుగురు యువ‌కులు సామూహిక అత్యాచారానికి (Minor Girl Gangraped in Kozhikode) పాల్ప‌డ్డారు. ఆపై ఘ‌ట‌న గురించి ఎవ‌రికైనా చంపేస్తామని తీవ్రంగా బెదిరించారు. ఎట్ట‌కేలకు రెండు వారాల త‌ర్వాత బాలిక విష‌యం బ‌య‌ట‌పెట్ట‌డంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వ‌చ్చింది. కేర‌ళ‌లోని కోజికోడ్ జిల్లా కుట్టియాడి గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 3న బాధిత బాలిక‌ను ఆమె స్నేహితుడు స్థానికంగా ఉండే ఓ టూరిస్ట్ స్పాట్‌కు ఆహ్వానించాడు. అక్క‌డికి వెళ్లిన బాలిక‌ను రిసార్ట్ లోప‌లికి తీసుకెళ్లి మ‌త్తుమందు క‌లిపిన జ్యూస్ తాగించాడు. ఆమె మ‌త్తులోకి జారుకోగానే త‌న ముగ్గురు స్నేహితుల‌ను పిలిచి న‌లుగురు క‌లిసి బాలిక‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. చివ‌రికి స్పృహ‌లోకి వ‌చ్చిన బాలిక‌ను విష‌యం ఎవ‌రికీ చెప్పొద్ద‌ని బెదిరించి ఆమె ఇంటి ద‌గ్గ‌ర వ‌దిలి వెళ్లారు. అయితే, రెండు వారాల నుంచి మూభావంగా ఉన్న బాలిక ఎట్ట‌కేల‌కు ధైర్యం చేసి మంగ‌ళ‌వారం సాయంత్రం త‌ల్లిదండ్రుల‌కు జ‌రిగిన ఘోరం గురించి చెప్పింది.

భర్త తనతో సెక్స్ చేయడం లేదని భార్య దారుణం, సలసల కాగే నూనె పైన పోసి ప్రతీకారం, లబోదిబోమంటూ ఆస్పత్రికి పరిగెత్తిన భర్త, యూపిలో బారాబంకి జిల్లాలో ఘటన

దాంతో వారు స్థానిక‌ పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబం నుంచి ఫిర్యాదు స్వీక‌రించిన పోలీసులు ఈ ఉద‌యం నిందితులు న‌లుగురిని అదుపులోకి (4 Accused Arrested) తీసుకున్నారు. వారిపై సంబంధిత చ‌ట్టాల కింద కేసులు న‌మోదు చేశారు.