Kerala Transwoman Death: ట్రాన్స్‌జెండర్‌ మృతి తట్టుకోలేక ఆమె ప్రియుడు ఆత్మహత్య, గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న అనన్య కుమారి అలెక్స్ భాగస్వామి జిజురాజ్
Representational Image (Photo Credits: ANI)

Kochi, July 24: కేరళకు చెందిన తొలి ట్రాన్స్‌జెండర్‌ రేడియో జాకీ, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేసిన తొలి ట్రాన్స్‌జెండర్‌ అనన్య కుమారి ఆత్మహత్య చేసుకుని మృతి (Kerala Transwoman Death) చెందిన సంగతి తెలిసిందే. qnrso అనన్య మృతి తట్టుకోలేక ఆమె భాగస్వామి జిజు రాజ్‌ (Jiju Raj) (36) కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరువనంతపురం తైకవు గ్రామం జగథి ప్రాంతానికి చెందిన జిజు రాజ్‌కు కొన్నేళ్ల క్రితం అనన్య కుమారితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రిత అనన్య కుమారి తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించింది. అనన్య మృతి వార్త తెలిసిన నాటి నుంచి జిజూ రాజ్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.

ఒంటరితనం వేధించసాగింది. ఈ బాధ నుంచి బయటపడటం కోసం జిజూ కొచ్చిలోని తన స్నేహితుడి రూమ్‌కి వెళ్లాడు. కానీ ముభావంగా ఉండసాగాడు. ఈ క్రమంలో శుక్రవారం స్నేహితుడు బయటకు వెళ్లిన తర్వాత జిజు అతడి గదిలో ఉరేసుకుని ఆత్మహత్య (her partner found dead in Kochi) చేసుకుని మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆరు లింగమార్పిడి సర్జరీలు, వెంటాడిన ఆనారోగ్యం, ఆత్మహత్య చేసుకున్న కేరళ ట్రాన్స్‌జెండర్‌ అనన్య కుమారి అలెక్స్, గత అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్‌ వేసిన మొదటి ట్రాన్స్‌జెండర్‌గా అనన్య కుమారి వెలుగులోకి

అనన్య కుమారి లింగమార్పిడి కోసం ఆరు సర్జరీలు చేయించుకుంది. కానీ వాటి వల్ల ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. తన అనారోగ్య సమస్యలకు ఆస్పత్రి వైద్యులే కారణమని ఆరోపించింది. వీటన్నింటితో డిప్రెషన్‌నకు గురైన అనన్య ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది.