crime-scene (Rep Image)

Kolkata, Dec 16: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లైంగిక కోరిక తీర్చలేదన్న ఆగ్రహంతో ఒక వ్యక్తి మహిళను కిరాతకంగా చంపేశాడు. అంతటితో ఆగక ఆమె తల నరకడంతోపాటు మృతదేహాన్ని మూడు ముక్కలుగా కోసి ఆ శరీర భాగాలను వివిధ చోట్ల పడేశాడు. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న 35 ఏళ్ల అతిఉర్ రెహమాన్ లస్కర్‌తో పాటు ఓ మహిళ రోజూ భవన నిర్మాణ కార్మిక పనులకు వెళ్లేది.

బావ వరుసైన లస్కర్‌ ఆమెను కోరిక తీర్చాలంటూ రోజూ వేధించేవాడు. అయితే ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో అతన్ని దూరం పెట్టి మొబైల్‌ నంబర్‌ను బ్లాక్‌ చేసింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న నిందితుడు డిసెంబర్‌ 12న గురువారం సాయంత్రం పని ముగిసిన తర్వాత నిర్మాణంలో ఉన్న భవనంలోకి రావాలని బలవంతం చేశాడు. అక్కడ ఆమెను అనుభవించేందుకు ప్రయత్నించగా ఆమె వ్యతిరేకించింది.

పోర్న్‌హబ్ 2024 రివ్యూ ఇదిగో, లెస్బియన్ పదాన్ని ఎక్కువగా సెర్చ్ చేసిన నెటిజన్లు, మహిళలే ఎక్కువగా దీనిలో లీనమయ్యారట..

దీంతో నిందితుడు ఆమె గొంతు నొక్కి హత్య చేశాడు.ఆ తర్వాత మహిళ తల నరకడంతోపాటు శరీరాన్ని మూడు భాగాలుగా కోసి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు.అనంతరం ఏమి తెలియనట్లుగా ఊరికి వెళ్ళాడు. శుక్రవారం ఉదయం రీజెంట్ పార్క్ ప్రాంతంలో తెగిన మహిళ తల పాలిథిన్ బ్యాగ్‌లో ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.అలాగే శనివారం చెరువు సమీపంలో మహిళ మొండెం, దిగువ భాగాన్ని పోలీసులు కనుగొన్నారు.దీంతో ఆ ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. అతిఉర్ రెహమాన్ లస్కర్‌ నిందితుడిగా గుర్తించారు. అతని సొంత ఊరుకు వెళ్లి అరెస్ట్ చేశారు. లస్కర్‌ను పోలీసులు గట్టిగా ప్రశ్నించగా లైంగిక కోరిక తీర్చనందుకు ఆ మహిళను హత్య చేసినట్లు చెప్పాడు.మహిళ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.