Kristen Stewart: ప్రముఖ హాలీవుడ్ నటి క్రిస్టెన్ స్టెవర్ట్ కీలక ప్రకటన చేశారు. సహనటి డైలాన్ మేయర్‌తో తనకు ఎంగేజ్‌మెంట్ అయ్యిందని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. రెండేళ్ల నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ ఇద్దరు నటీమణులు…త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు.
అయితే వీరద్దరు రహస్యంగా వివాహం చేసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ తాజా ప్రకటనతో వీరి రిలేషన్‌షిప్‌పై జనాలకు ఓ క్లారిటీ వచ్చింది.
సైరస్ ఎక్స్‌ఎం ది హోవార్డ్ స్టెర్న్ షోకు గెస్ట్‌గా వచ్చిన క్రిస్టెన్ తన ఎంగేజ్‌మెంట్ వార్తను ప్రకటించారు. పెళ్లి పనులు జరుగుతున్నాయని తెలిపారు.
View this post on Instagram
ఇక క్రిస్టెన్, డైలాన్ 2019 నుంచి డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ ఈ ఇద్దరు ఎప్పడూ ఈ వార్తలపై స్పందించలేదు. కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టైల్ మ్యాగ్‌జైన్ ఇంటర్వ్యూ సందర్భంగా క్రిస్టెన్ తనకు, డైలాన్‌కు మధ్య ఉన్న అనుబంధం గురించి వివరించారు.
డైలాన్ మేయర్ నటి, రచయిత. ఆమె మోక్సీ, రాక్ బాటమ్, మిస్ 2059 వంటి చిత్రాలతో పాపులర్ అయ్యారు. క్రిస్టెన్ స్టెవర్ట్ తదుపరి స్పెన్సర్‌లో కనిపించనుంది. ఇందులో ఆమె యువరాణి డయానాగా నటించనుంది. క్రిస్టెన్ స్టీవర్ట్ గతంలో సూపర్ మోడల్ స్టెల్లా మాక్స్‌వెల్, ట్విలైట్ సహనటుడు రాబర్ట్ ప్యాటిన్సన్‌లతో డేటింగ్ చేసింది.