Locals Loot Chickens After Pickup Truck Overturns

Lucknow, FEB 15: కోళ్లు రవాణా చేస్తున్న వాహనం బోల్తా పడింది. అందులోని కోళ్లు రోడ్డు పక్కన పడ్డాయి. గమనించిన స్థానికులు చేతికి అందిన కోళ్లను ఎత్తుకెళ్లారు. (Locals Loot Chickens) ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అమేథి నుంచి ఫిరోజాబాద్‌కు కోళ్లను రవాణా చేస్తున్న వాహనం డ్రైవర్‌, నిద్ర మత్తులో అదుపుకోల్పోయాడు. దీంతో కన్నౌజ్ ఎక్స్‌ప్రెస్‌వేపై అది బోల్తాపడింది. ఆ వాహనంలోని కోళ్లు రోడ్డు పక్కన పడ్డాయి.

Locals Loot Chickens After Pickup Truck Overturns

 

కాగా, గమనించిన స్థానికులు ఆ కోళ్ల కోసం ఎగబడ్డారు. చేతికి అందిన వాటిని ఎత్తుకెళ్లారు. అయితే ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కోళ్లను లూఠీ చేస్తున్న వారిని చెదరగొట్టారు. గాయపడిన వాహన డ్రైవర్‌, సిబ్బందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరోవైపు కొందరు వ్యక్తులు మొబైల్‌ ఫోన్లలో రికార్డ్‌ చేసిన వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.