Election Commission of India. (Photo Credit: Twitter)

New Delhi, Jan 23: దేశంలో సార్వత్రిక ఎన్నికలు (General election 2024) ఏప్రిల్‌లోనే జరగబోతున్నాయా? ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ మూడో వారంలో నిర్వహించనున్నారా? ఏప్రిల్‌ 16 తేదీని ఎన్నికలకు రిఫరెన్స్‌ తేదీగా పేర్కొంటూ ఢిల్లీ ఎన్నికల ముఖ్య అధికారి జారీ చేసిన ఓ సర్క్యులర్‌ వైరల్‌గా మారడంతో ఈ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. జనవరి 28వ తేదీ అర్ధరాత్రి వరకు ఏపీపీఎస్సీ గ్రూప్‌ -1 పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగింపు, మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష

దీనిపై ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం స్పందించింది. ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు అనే వార్త నిజమేనా అని కొన్ని మీడియా సంస్థలు తమను వాకబు చేస్తున్నాయని ఢిల్లీలోని సీఈవో కార్యాలయం వెల్లడించింది. ఏప్రిల్ 16 అనేది లోక్ సభ ఎన్నికల తేదీ కాదని, దేశవ్యాప్తంగా ఉన్న సిబ్బంది ఎన్నికల పనులు పూర్తి చేయడానికి నిర్దేశించిన గడువు తేదీ అని స్పష్టం చేసింది.

Here's EC tweet

letter goes viral

ఆ తేదీ లోపు ఎన్నికల ప్రణాళికల ప్రకారం పనులన్నీ పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని సీఈవో కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు సంబంధిత వర్గాలకు ఈ నెల 19న అధికారిక లేఖను జారీ చేశామని వెల్లడించింది. ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం సరైన సమయంలో ప్రకటిస్తుందని సీఈవో కార్యాలయం తెలిపింది.