Jitendra Awhad and Ayodhya Seer Paramhans Acharya (photo-ANI)

New Delhi, Jan 4: శ్రీరాముడిపై మహారాష్ట్రకు చెందిన ఎన్‌సీపీ నేత డాక్టర్‌ జితేంద్ర అవద్‌ (Jitendra Awhad) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. షిర్డీలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో శ్రీరాముడు శాకాహారి కాదని.. మాంసాహారేనని ఎన్‌సీపీ ఎంపీ (NCP Sharad Pawar faction leader Jitendra Awhad) వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్లు అడవిలో నివసించే వ్యక్తి శాకాహారం కోసం ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు.దీనిపై బీజేపీ నేత రామ్‌ కదమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక అయోధ్యకు చెందిన సాధువు పరమహంస ఆచార్య (Lord Ram was Non-Vegetarian Remarks) ఎంపీపై మండిపడ్డారు. ఎంపీ వ్యాఖ్యలు అవమానకరమని, రామభక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ కేంద్ర ప్రభుత్వాలను కోరుతానన్నారు. రాముడి గురించి తప్పుగా మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జితేంద్ర అవద్‌పై కఠిన చర్యలు తీసుకోకుంటే చంపేస్తామని హెచ్చరిస్తున్నానన్నారు.

రాముడు మాంసాహారం తీసుకున్నట్లు గ్రంథాలలో ఎక్కడా చెప్పలేదు, అవద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్

అలాగే రామజన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్‌ ఎంపీ వ్యాఖ్యలను ఖండించారు. ఎన్‌సీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు తప్పని.. రాముడు వనవాసానికి వెళ్లిన సమయంలో మాంసాహారం తిన్నాడని ఏ గ్రంథంలోనూ రాయలేదన్నారు. దుంపలు, పండ్లు తిన్నట్లుగా ప్రతిచోటా రాసి ఉందని.. అందుకు శాస్త్రాలే సాక్ష్యమన్నారు.

Here's Videos

ఇదిలా ఉంటే తనపై వచ్చిన విమర్శలు, వ్యాఖ్యలపై అవద్ క్లారిటీ ఇచ్చారు. ఎవరి మనోభావాలను దెబ్బ తీయడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. కొంత మంది మనోభావాలను దెబ్బ తీసిందని తెలిసిబాధగా అనిపించిందన్నారు. అలా మాట్లాడకుండా ఉండాల్సిందన్నారు.రాముడు మాంసాహారి అని తాను చెప్పింది సొంత వ్యాఖ్యలేమికావని.. వాల్మీకి రామాయణంలోనే రాసి ఉందన్నారు. 1891 నాటి అధికారిక ప్రతిని కోల్‌కత్తా ఐఐటీ కాన్పూర్‌లో ప్రింట్ చేశారన్నారు.

తాను చెప్పినదంతా 1891 నాటి పుస్తకంలో రాసి ఉందని.. ఆ పుస్తకాన్ని నేనేమీ రాయలేదన్నారు. ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే తాను విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. 22 వరకు ఎలాంటి లాజిక్‌పై చర్చ ఉండదని.. భావోద్వేగాలపైనే చర్చ ఉంటుందన్నారు. తనపై దాఖలైన ఫిర్యాదుపై.. ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌కు భయపడేది లేదని చెప్పారు.