 
                                                                 Lord Ram Was Non-Vegetarian' Remark Row: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- శరద్ పవార్ వర్గం నాయకుడు జితేంద్ర అవద్ శ్రీరాముడిపై ఇటీవల చేసిన మాంసాహార ప్రకటనల వ్యాఖ్యలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన పూజారి, ఆచార్య సత్యేంద్ర దాస్ (Ram Temple Chief Priest Acharya Satyendra Das) తీవ్రంగా ఖండించారు. ఆ వ్యాఖ్యలు "పూర్తిగా తప్పు" అని తెలిపారు.
ఈ ప్రకటనలను వ్యతిరేకిస్తూ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్, "ఎన్‌సిపి నాయకుడు జితేంద్ర అవద్ మాట్లాడుతున్నది పూర్తిగా అబద్ధం, శ్రీరాముడు వనవాస సమయంలో మాంసాహారం (Jitendra Awhad's Non-vegetarian Remarks) తీసుకున్నట్లు మన గ్రంథాలలో ఎక్కడా వ్రాయబడలేదు. అక్కడ పండ్లు ఉండేవి. అలాంటి అబద్ధాల కోరుకు మన రాముడిని అవమానించే హక్కు లేదు. మా దేవుడు ఎప్పుడూ శాఖాహారమే. మన రాముడిని అవమానించేలా కించపరిచే మాటలు మాట్లాడుతున్నాడు" అని ఆచార్య సత్యేంద్ర దాస్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
శ్రీరాముడు 'బహుజనులకు' (మెజారిటీ ప్రజలు) చెందినవాడని, సాధారణ నమ్మకానికి విరుద్ధంగా మాంసాహారం తినేవాడని అవద్ బుధవారం పేర్కొన్నారు. రాముడు మావాడు. రాముడు బహుజనుల వాడు. వేటాడి తినే రాముడు మాలాగే బహుజనుడు, మీరు మనందరినీ శాకాహారులుగా మార్చడానికి వెళ్ళినప్పుడు, మేము రాముడి ఆదర్శాలను అనుసరిస్తాము. ఈ రోజు మేము మటన్ తింటాము. ఇది రాముడి ఆదర్శం" అని మహారాష్ట్రలోని షిర్డీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో అవద్ అన్నారు."రామ్ శాఖాహారం కాదు, అతను మాంసాహారం" అన్నారాయన.
అవద్ వివాదాస్పద ప్రకటన తర్వాత, బిజెపి ఎమ్మెల్యే రామ్ కదమ్ ముంబైలో ఎన్‌సిపి నేతపై ఫిర్యాదు చేశారు. రామభక్తుల మనోభావాలను దెబ్బతీయాలనేది వారి ఆలోచన. ఓట్లు దండుకోవడానికి హిందూ మతాన్ని ఎగతాళి చేయలేరు. రామమందిరాన్ని నిర్మించారనే విషయం ‘ఘమంది’ కూటమికి మింగుడు పడలేదు’’ అని రామ్ కదమ్ అన్నారు.
శ్రీరాముడు మాంసాహారే, నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తెలిపిన ఎన్సీపీ నేత జితేంద్ర అవద్
ఎన్‌సీపీ నేత చేసిన ప్రకటనపై హిందూ దార్శనికుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. రాముని గురించి "అవమానంగా" మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయోధ్య సీయర్ పరమహంస్ ఆచార్య..కేంద్రాన్ని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అవద్ యొక్క ప్రకటనలు భగవాన్ భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని అన్నారు.
"జితేంద్ర అవద్ ఇచ్చిన ప్రకటన ధిక్కారమైనది, రామభక్తుల మనోభావాలను దెబ్బతీసింది. రాముడిని దూషించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను" అని ఆయన అన్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోకపోతే, నేను జితేంద్ర అవద్‌ను చంపేస్తాను. నేను వార్నింగ్ ఇస్తున్నాను" అన్నారాయన
ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో అవద్ మళ్లీ స్పందించారు. "మాంసాహారం" వ్యాఖ్యపై.. నేను నా విచారం వ్యక్తం చేస్తున్నాను, నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదు" అని అన్నారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
