Madhya Pradesh: ఐస్ క్రీం తిన్న 55 మందికి వాంతులు, విరేచనాలు, అందులో 25 మంది చిన్నారులు, ఇద్దరి పరిస్థితి విషమం, మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఘటన
Ice Cream in Winter (Photo Credits: Pixabay)

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఐస్ క్రీం తిన్న 55 మంది అస్వస్థకు గురయ్యారు. అందులో 25 మంది చిన్నారులు ఉన్నారు. వాళ్లలో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఖర్గోన్ లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమానికి వచ్చిన వాళ్లంతా అక్కడ పెట్టిన ఐస్ క్రీం తిన్నారు. ఐస్ క్రీం తిన్నవాళ్లందరికీ కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు జరిగాయి.

చికెన్ కూర మొత్తం తినేసిన తండ్రి, నాకేది అని గొడవపడిన కొడుకు, కోపంతో తల పగలగొట్టి చంపిన నాన్న, కర్ణాటకలో దారుణ ఘటన

దాంతో వాళ్లంతా సమీపంలోని హాస్పిటల్ లో చేరారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరు పిల్లలను మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆ 52 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఐస్ క్రీం తయారు చేసిన దినేష్ కుష్వాహాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫుడ్ పాయిజన్ కు గల కారణం తెలుసుకోవడం కోసం.. అస్వస్థకు గురైన వాళ్లదగ్గరి నుంచి షాంపిల్స్ తీసుకుని టెస్టులకు పంపించారు.