Bhopal, May 17: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే (MLA Umang Singhar) నివాసంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమాంగ్ సింఘర్ నివాసంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం అక్కడ కలకలం రేపుతోంది. మృతురాలు ఆత్మహత్య (woman allegedly died by suicide)చేసుకుంటూ సూసైడ్ నోట్ కూడా రాసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే (Congress MLA Umang Singhar) జీవితంలో నాకు స్థానం లభించనందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో ఆమె పేర్కొంది.
బోఫాల్ పోలీసులు సంఘటన స్థలం నుంచి సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనిలో ‘‘సింఘర్ జీవితంలో నాకు చోటు లేదని అర్థం అయ్యింది. అందుకే నా జీవితాన్ని ముగించాలనుకుంటున్నాను’’ అని రాసి ఉందని వారు తెలిపారు. కాగా మృతురాలిని భోపాల్‌లోని షాపురా ప్రాంతానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు . ఏడాది కాలంగా ఆమెకు, సింఘర్‌కు పరిచయం ఉందని.. మృతురాలు తరచుగా ఎమ్మెల్యే నివాసానికి వస్తూ ఉండేదన్నారు. పైగా ఆమె మరణించడానికి 25-30 రోజుల ముందు నుంచి ఎమ్మెల్యే నివాసంలోనే ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రాజేష్ సింగ్ భదోరియా (ASP Bhopal Rajesh Singh Bhadoriya) మాట్లాడుతూ.. ‘‘ఎమ్మెల్యే భవనంలో ఓ పనిమనిషి, అతడి భార్య నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పనిమనిషి.. మృతురాలు నిద్రిస్తున్న గది తలుపు తట్టి చూడగా.. ఎలాంటి స్పందన లేదు. దాంతో వెంటనే పని మనిషి ఈ విషయాన్ని యజమాని సింఘర్‌కు తెలిపాడు. ఇక ఎమ్మెల్యే సూచనల మేరకు పనిమనిషి గదిలోకి వెళ్లి చూడగా.. అక్కడ సదరు మహిళ వేలాడుతూ కనిపించింది’’ అని అన్నారు.
Here's ANI Update
Madhya Pradesh: A woman allegedly died by suicide at the residence of Congress MLA Umang Singhar, in Bhopal.
ASP Bhopal Rajesh Singh Bhadoriya says, "Postmortem was done today, report awaited. Statements of her mother & son were recorded. Further investigation is underway." pic.twitter.com/tQybrupUHg
— ANI (@ANI) May 17, 2021
ఈ ఘటనపై సింఘర్ మాట్లాడుతూ.. ‘‘ఇది హృదయ విదారక సంఘటన. చనిపోయిన మహిళ నాకు మంచి స్నేహితురాలు. ఆమె మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ.. చికిత్స తీసుకుంటుందని నాకు తెలియదు. గత రెండు రోజులుగా నేను భోపాల్‌లో లేను. ఇక పోలీసులు ఆమె వద్ద నుంచి అంబాలా, భోపాల్ ఆస్పత్రులకు సంబంధించిన ప్రిస్క్రిప్షన్లను కనుగొన్నారు. ఇక సదరు మహిళ అనారోగ్యం గురించి నాకు ముందే తెలిసి ఉంటే.. మంచి చికిత్స ఇప్పించేవాడిని. ఇలా జరగకుండా చూసేవాడిని’’ అని తెలిపారు. "ఈ రోజు పోస్టుమార్టం జరిగింది, నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం. ఆమె తల్లి మరియు కొడుకు యొక్కస్టేట్ మెంట్ నమోదు చేశాం. తదుపరి దర్యాప్తు జరుగుతోంది" అని ASP భోపాల్ రాజేష్ సింగ్ భదోరియా చెప్పారు.