Madhya Pradesh: నాలో పురుష లక్షణాలు ఉన్నాయి, స్త్రీగా జీవించలేను, మగాడిగా మారేందుకు లింగ మార్పిడికి అవకాశం ఇవ్వాలని మహిళా కానిస్టేబుల్ దరఖాస్తు, అనుమతులు ఇచ్చిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
Madhya Pradesh Home minister Narottam Mishra (Photo-ANI)

Bhopal, December 2: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహిళగా పుట్టిన కానిస్టేబుల్ పురుషుడిగా మారాలంటూ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంది. దీనిని పరిశీలించిన హోం శాఖ ఆమెకు అనుకూలంగా అనుమతులిచ్చింది. లింగ మార్పిడి కోసం అనుమతిని ఇచ్చింది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయంతో ఆమె లింగ మార్పిడి (sex reassignment surgery) చేయించుకుని మహిళ కాస్తా మగవాడిగా మారనుంది. ఇలా లింగ మార్పిడికి అనుమతి ఇవ్వటంతో మధ్యప్రదేశల్ లో ఇదే తొలిసారిగా చెప్పవచ్చు.

చిన్నప్పటి నుంచి తనలో పురుష లక్షణాలు ఉన్నాయని, కాబట్టి పురుషుడిగా మారేందుకు అనుమతి ఇవ్వాలంటూ సదరు మహిళా కానిస్టేబుల్ (Woman Constable) 2019లో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతోపాటు అఫిడవిట్ కూడా జతచేశారు. పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు ఆమె దరఖాస్తును హోంశాఖకు పంపించారు. మరోవైపు, కానిస్టేబుల్‌లో చిన్నతనం నుంచి పురుష లక్షణాలు ఉన్నట్టు సైకాలజిస్టులు కూడా నిర్ధారించారు. దీంతో ఆమె పురుషుడిగా మారేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చినట్టు హోంశాఖ అదనపు కార్యదర్శి రాజేశ్ రాజోరా తెలిపారు.

నేరుగా క్లాస్ రూంలోకి వచ్చిన చిరుతపులి, పదేళ్ల బాలుడిపై దాడి, భయంతో పరుగులు పెట్టిన మిగతా విద్యార్థులు

నిబంధనల ప్రకారం భారత పౌరులు తమ కులం, మతానికి సంబంధం లేకుండా లింగమార్పిడి చేయించుకోవచ్చని, నిబంధనలకు లోబడే అనుమతులు ఇచ్చినట్టు రాజేశ్ తెలిపారు. లింగమార్పిడి తరువాత కూడా ఆమె (అతడుగా మారాక) కూడా కానిస్టేబుల్ గా ఉద్యోగంలో కొనసాగేందుకు హోంశాఖ అంగీకరించింది. 2019లో గెజిట్ ఆఫ్ ఇండియాలో ఉన్న నోటిఫికేషన్ ఆధారంగా ఆఫిడవిట్ సమర్పిస్తూ సదరు మహిళా కానిస్టేబుల్ దరఖాస్తు చేసుకుంది. దీనిపై రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి సమీక్ష తర్వాత కీలక నిర్ణయం తీసుకుని అనుమతి ఇచ్చిందని డీజీపీ కార్యాలయం తెలిపింది.

ఇదే మొదటి కేసు కాదు.. ఐదు సంవత్సరాల క్రితం.. బీడ్ కు చెందిన 29 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ తన జెండర్ ను మార్చుకోవడానికి అనుమతి కోరింది. దేశంలో ఇదే తొలి కేసు. అన్ని చట్టపరమైన అడ్డంకులను తొలగించిన తర్వాత ఆమెకు లింగ మార్పిడి సాధ్యమైంది. ఈ చట్టపరమైన ప్రక్రియకు అతనికి రెండు మూడేళ్ల పట్టింది. లింగమార్పిడికి అనుమతించాలంటూ ఆ మహిళా కానిస్టేబుల్ చేసుకున్న అభ్యర్థనను మొదట మహారాష్ట్ర పోలీసులు తిరస్కరించారు. దీంతో ఆమె ఔరంగాబాద్ ఐజీపీ రాజ్ కుమార్ వాట్కర్ తన విషయం వివరిస్తు లేఖ రాశారు. ఆ తర్వాత హైకోర్టు అనుమతితో ఆమె అభ్యర్థనను మహారాష్ట్ర హోంమంత్రిత్వశాఖ అంగీకరించింది.

జెసిబి మీద నుంచి కింద పడిన వధూవరులు, వెడ్డింగ్ సమయంలో అనుకోని ఘటన

కాగా సదరు మహిళా కానిస్టేబుల్కు చిన్నప్పటినుంచి Gender identity disorder సమస్య ఉంది. జాతీయ స్థాయి సైకియాట్రిస్టులు కూడా దీనిని ధ్రువీకరించారు. పోలీసు హెడ్ క్వార్డర్స్ అనుమతి కోసం హోంశాఖ నుంచి గైడెన్స్ తీసుకుంది. దీనిపై డాక్టర్ రాజూరా మాట్లాడుతూ.. దేశంలో ఏ పౌరుడైన తన మతం, కులంతో సంబంధం లేకుండా తన జెండర్ ను ఎంచుకునే స్వేచ్ఛ ఉందని అన్నారు. ఇందులో భాగంగా లా డిపార్ట్మెంట్ ను సంప్రదించి.. హోం శాఖ తరఫున పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు అనుమతి లభించిందని తెలిపారు.